Rajamouli: ఒక సినిమాని చేయడం ఎంత ముఖ్యమో దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం… ప్రతి సినిమాకి సరైన ప్రమోషన్స్ ఉంటేనే ఆ సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఇక ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో భారీ ప్రమోషన్స్ చేస్తూ ప్రతి ప్రేక్షకుడు మొదటి రోజు తన సినిమాని చూడాలి అనుకునేంతల వాళ్ళలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి సమయం దొరికినప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ను కూడా చేపడుతున్నాడు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన రాజమౌళి ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ ని కూడా ఇవ్వలేదు. ఇందులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు అనే ఒక అనౌన్స్ మెంట్ తప్ప మిగతా ఏది కూడా అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక నవంబర్ నెల నుంచి పూర్తి అప్డేట్ ని ఇస్తానని చెప్పిన రాజమౌళి ఈనెల వచ్చేసింది. కాబట్టి నిన్న నైట్ అందరు కలిసి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు అనే విషయం మీద తన అభిమానుల తరుపున ఒక క్వశ్చన్ అడిగాడు…రాజమౌళి దానికి సమాధానం గా తొందరలోనే ఇస్తాను అంటూ సమాధానం చెప్పాడు.
ఇక ఇదంతా చూస్తున్న జనాలు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కడ డబ్బులు అవసరం లేకుండా సినిమాని ప్రమోట్ చేసుకోవాలి అనే విషయం రాజమౌళి కి తెలుసు అంటున్నారు. అందుకే సినిమా ప్రమోషన్స్ ని చేపట్టడానికి ఈసారి ట్విట్టర్ ను వాడుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి చేసిన ప్రతి సినిమా విషయంలో ఆయన ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు.
ఎప్పుడు మన సినిమాకి సంబంధించిన ఏదో ఒక విషయం జనాల నోట్లో నానుతూ ఉండేలా చూసుకుంటాడు. ఎవరు సినిమా గురించి మర్చిపోకూడదని కొన్ని ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఇక అందులో భాగంగా చేసిందే ట్విట్టర్ మీటింగ్… ఇక రాజమౌళి ఏది చేసినా సరే కొత్తగా చేస్తాడు. ఆయన సినిమా మీద పెట్టే బడ్జెట్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆయన ప్రమోషన్ కోసం కూడా కొంత బడ్జెట్ అయితే కేటాయిస్తూ ఉంటాడు.
కానీ కొన్ని సందర్భాల్లో డబ్బులేమీ లేకుండా కూడా ప్రమోషన్స్ చేయొచ్చు అని తన తెలివిని ఉపయోగించి ఇలాంటి కొన్ని ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. దానివల్ల సినిమా మీద అటెన్షన్ క్రియేట్ అవుతోంది…ఇక మిగతా వాళ్ళు ప్రమోషన్స్ కోసం కోట్లకు కోట్లు ఖర్చుపెడుతుంటే రాజమౌళి మాత్రం డబ్బులు లేకుండా ఫ్రీ ప్రమోషన్స్ చేస్తున్నాడు. మొత్తానికైతే జక్కన్న తన రూటే సపరేటు అనేలా మంచి సినిమాలు చేస్తూ అంత మించిన ప్రమోషన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు..