https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ ఓవర్ బడ్జెట్ పై రాజమౌళి ప్లాన్ !

ఒక నిర్మాతగా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి అత్యంత భారీ సినిమాను తలెకెత్తుకోవడం అంటే.. అది తలకు మించిన భారమే. అసలు ఈ సినిమాకి నిర్మాతగా దానయ్య ఎలాంటి టెన్సన్స్ ను పేస్ చేస్తున్నాడో అని తోటి నిర్మాతలు కూడా భయపడే పరిస్థితి ఉన్న ఈ కరోనా కాలంలో.. దానయ్య కూడా కాస్త టెన్షన్ కి గురవుతున్నాడట. సినిమా షూట్ సజావుగా జరుగుతోన్న సమయంలో కరోనా వచ్చి సినిమా షెడ్యుల్స్ మొత్తాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అసలు కరోనా రాకముందే రెండు […]

Written By:
  • admin
  • , Updated On : September 20, 2020 / 12:49 PM IST
    Follow us on


    ఒక నిర్మాతగా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి అత్యంత భారీ సినిమాను తలెకెత్తుకోవడం అంటే.. అది తలకు మించిన భారమే. అసలు ఈ సినిమాకి నిర్మాతగా దానయ్య ఎలాంటి టెన్సన్స్ ను పేస్ చేస్తున్నాడో అని తోటి నిర్మాతలు కూడా భయపడే పరిస్థితి ఉన్న ఈ కరోనా కాలంలో.. దానయ్య కూడా కాస్త టెన్షన్ కి గురవుతున్నాడట. సినిమా షూట్ సజావుగా జరుగుతోన్న సమయంలో కరోనా వచ్చి సినిమా షెడ్యుల్స్ మొత్తాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అసలు కరోనా రాకముందే రెండు రిలీజ్ డేట్ లు మార్చుకున్న ‘ఆర్ఆర్ఆర్’, 2021 సంక్రాంతికి వచ్చింది. ఇప్పుడు పరిస్థితిని బట్టి అసలు 2021 సమ్మర్ కి కూడా ఈ సినిమా రెడీ అవుతుందని నమ్మకం లేకుండా పోయింది ఎవ్వరకి. దాంతో అనుకున్నదాని కంటే బడ్జెట్ రెట్టింపు అయ్యే అవకాశం ఉందనేది నిర్మాతగా దానయ్య భయం.

    Also Read: దర్శకుడి వికృత చేష్టల పై హీరోయిన్ ఫిర్యాదు !

    ఎంత రాజమౌళి అయితే మాత్రం వందల కోట్ల వ్యాపారం కాబట్టి దానయ్య భయపడటంలో అర్ధం ఉంది. ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ షూట్ కి వచ్చినా… కీలక పాత్రలు చేస్తోన్న విదేశి నటీనటులు ఇప్పట్లో షూటింగ్ కు వచ్చే ఆలోచనలో లేరని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా వల్ల వచ్చే పాన్ ఇండియా కలెక్షన్స్ అలా వుంచితే, నాలుగేళ్ళ విలువైన కాలంతో పాటు ఈ సినిమాకి పెట్టే పెట్టుబడి కూడా ఇప్పుడు పెరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో నిర్మాత దానయ్య బాధను భయాన్ని అర్ధం చేసుకొని ఈ సినిమాకి డైరక్టర్ గా రాజమౌళి తన బాధ్యతను నేరవేర్చాడు. సినిమాకి అయ్యే ఓవర్ బడ్జెట్ విషయంలో దానయ్యకు జక్కన్న భరోసా ఇచ్చాడు.

    Also Read: బిగ్‌బాస్-4: కరాటే కల్యాణ్ ఔట్.. రెండో ఎలిమినేటర్ ఎవరంటే?

    సినిమాకి బడ్జెట్ పెరిగితే.. నటీనటుల రెమ్యునిరేషన్ ను తగ్గించే విధంగా ప్లాన్ చేద్దామని దానయ్యకు జక్కన్న ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. మీరు ఏమీ టెన్షన్ పడవద్దని, ఈ సినిమాకి మనం పెట్టినదాని కన్నా ఎక్కువ మార్కెట్ అవుతుందని చెప్పి దానయ్యకు కాస్త ఊరట కలిగించాడు రాజమౌళి. పాపం ఈ సినిమా మొదలయ్యాక నిర్మాత దానయ్య హార్ట్ కు స్టెంట్ కూడా వేయించుకున్నారు. హార్ట్ కు స్టెంట్ అంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆయన ఎంతలా టెన్షన్ పడుతున్నారో అని.