Varanasi Budget: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా రోజురోజుకీ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. మొదటి 1000 కోట్ల తో తెరకెక్కించాలి అనుకున్నప్పటికి, ఆ తర్వాత 1200 కోట్లు బడ్జెట్ అయితే అవుతుంది అని ఎస్టిమేషన్ వేశారు. ఆ తర్వాత అది 1500 కోట్ల వరకు అవుతుందని అంచనాకైతే వచ్చారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 1700 కోట్ల వరకు అవ్వబోతుందట. ఫస్ట్ కాపీ వచ్చేంత వరకు 1700 కోట్ల వరకు బడ్జెట్ ఈజీగా అవుతుందని సినిమా వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటే పర్లేదు. కానీ ఒకవేళ తేడా కొడితే మాత్రం ప్రొడ్యూసర్ భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ప్రొడ్యూసర్ రోడ్డున పడే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రాజమౌళి సినిమాలో హై ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉంటాయి.
కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు రిపీటెడ్ గా చూసి అంతకుమించిన సక్సెస్ ను సాధించి 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే పర్లేదు కానీ లాస్ లను తీసుకొచ్చి పెడితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు… ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించాయి.
కాబట్టి తనతో సినిమాలు చేయడానికి అటు హీరోలు, ఇటు ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అతనితో ఒక్క సినిమా చేస్తే చాలు భారీ సక్సెస్ సాధించవచ్చు అనే ఆలోచనలో హీరోలు ప్రొడ్యూసర్స్ ఉండటం వల్ల అతను ఎంత బడ్జెట్ అంటే అంత బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్లు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ప్రస్తుతం వారణాసి సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…