Rajamouli Varanasi movie : ఒక సినిమాని సక్సెస్ తీరాలకు ఎలా చేర్చాలి. ఆ సినిమాని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనేది రాజమౌళి బాగా తెలుసు… తన సినిమా కోసం ఎంత బడ్జెట్ ని కేటాయిస్తాడో? అంతకు మించిన వసూళ్లను రాబడుతుంటాడు. ఇప్పటివరకు ఆయనను బీట్ చేసే దర్శకుడు ఇండియాలో లేడనే చెప్పాలి. ‘బాహుబలి’, ‘ త్రిబుల్ ఆర్’ సినిమాలతో గొప్ప విజయాలను సాధించిన ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో ఫ్యాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు. ‘వారణాసి’ అనే టైటిప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 2027 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఆయన డిఫరెంట్ గా ప్రమోషన్స్ ని నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సినిమాను రిచ్ చేయడానికి ఆయన అక్కడ టాప్ డైరెక్టర్లు అందరితో కలిసి ఒక ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వాళ్ళందరూ రాజమౌళి కోసం వస్తారా అంటే ఇప్పటికే రాజమౌళి వాళ్ళందరినీ సెట్ చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇది కనక వర్కౌట్ అయితే మాత్రం రాజమౌళి సైతం హాలీవుడ్ దర్శకులతో పోటీపడే రేంజ్ కి వెళ్ళిపోతాడు. అలాగే ఈ సినిమా మీద అంచనాలు తార స్థాయికి వెళ్ళిపోతాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకుంటాడు. ఇక ఇలాంటి ఒక సిచువేషన్ రాజమౌళి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా కోసం హాలీవుడ్ దర్శకులందరిని ఏకం చేయగలుగుతాడా? తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది…
తను ఏ పనినైనా చాలా సులువుగా చేసుకుంటూ వెళ్తాడు. ముందే ఒక ప్రణాళికను గీసుకొని దానికి అనుగుణంగా ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ప్రతిదీ బిజినెస్ యాంగిల్ లోనే ఆలోచిస్తాడు. సినిమా గ్లింప్స్ రావాలన్న దాని టీజర్ రిలీజ్ చేయాలి అన్న హీరో లుక్కు వదలాలి అని అనుకున్న కూడా ప్రతిదీ బిజినెస్ యాంగిల్ లో చూస్తాడు.
అందుకే రాజమౌళి తో సినిమాలు చేయడానికి స్టార్ ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి డబుల్, త్రిబుల్ కలెక్షన్స్ వస్తాయనే విషయం వాళ్లందరికి తెలుసు… ఇక రాజమౌళి చేపట్టబోతున్న నయా ప్రమోషన్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతోంది అనేది తెలియాల్సి ఉంది…