Rajamouli : స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి (Rajamouli) అప్పటినుంచి ఇప్పటివరక ఆయను చేసిన ప్రతి సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. మరి ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయిని పెంచాయనే చెప్పాలి. ఇక త్రిబుల్ ఆర్ (RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధిస్తాననే దృఢ సంకల్పంతో మహేష్ బాబు ఉన్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మారుతున్న క్రమంలో రాజమౌళి తో సినిమా చేసే అవకాశం రావడం అనేది నిజంగా మహేష్ బాబు అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయనతో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి మాత్రం మహేష్ బాబు కి ఓటు వేసి అతనితోనే సినిమా చేద్దాం అని అనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమా దాదాపు 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 3000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ రికార్డులను కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
ఒకవేళ ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఈ మూవీతో వరల్డ్ లెవెల్లో తను చాలా మంచి డైరెక్టర్ గా ఫేమస్ అవుతాడు. ఇక తను ఆరాధించే జేమ్స్ కామెరూన్ లాంటి డైరెక్టర్ పక్కన నిలబడటానికి అర్హత సాధిస్తాడు. ఇకమీదట రాజమౌళి చేయబోయే సినిమాలు మంచి విజయాన్ని సాధించి తనకు గొప్ప గుర్తింపును తీసుకురావాలని కోరుకుందాం…
ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కని గౌరవం అయితే రాజమౌళికి దక్కింది. మరి ఈ సినిమాతో ఆస్కార్ అవార్డుని అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో అయిన విక్రమ్ (Vikram ) ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలయితే వచ్చాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో విక్రమ్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. మరి తన పాత్ర ఎలా ఉండబోతుంది విలన్ గా నటిస్తున్నాడా? లేదంటే హీరోకి సపోర్ట్ చేసే క్యారెక్టర్ లో నటిస్తున్నాడా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?