Rajamouli-Mahesh babu : భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాకు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు SSMB29 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. దీని బడ్జెట్ ఏకంగా రూ.1000 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. ఈ సినిమాకు టైటిల్ అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా పనులు చాలా కాలం క్రితమే మొదలయ్యాయి. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ కూడా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రియాంక చోప్రా కూడా ఒక ముఖ్యమైన నెగటివ్ పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే, మహేష్ బాబు సినిమా కోసం నానా పాటేకర్‌కు కూడా ఒక పాత్రను ఆఫర్ చేశారు. కానీ ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.
భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ సినిమాను తిరస్కరించడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. నానా పాటేకర్ సినిమా ఆఫర్‌ను తిరస్కరించారన్న వార్త దావానలంలా వ్యాపించింది. కొత్త నివేదికల ప్రకారం.. ఈ పాత్ర కోసం రాజమౌళి స్వయంగా నానా పాటేకర్‌కు కథ చెప్పడానికి వెళ్ళారు.
Also Read : మ్యాడ్ స్క్వేర్’ డైరెక్టర్ తో నవీన్ పోలిశెట్టికి ఇంత పెద్ద గొడవ జరిగిందా!
మీడియా నివేదికల ప్రకారం.. రాజమౌళి స్వయంగా నానా పాటేకర్‌ను కలిసి ఈ పాత్రను ఆఫర్ చేశారు. ఆయన హైదరాబాద్ నుంచి పుణేలోని నానా పాటేకర్ ఫామ్‌హౌస్‌కు వెళ్ళి కలిశారు. అక్కడ ఆయన నానా పాటేకర్‌కు స్క్రిప్ట్ వినిపించారు. మహేష్ బాబు తండ్రి పాత్రను నానా పాటేకర్‌కు ఆఫర్ చేశారు. ఇది సినిమాలో ఒక కీలకమైన పాత్ర.
ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో కొన్ని కొత్త, ఆసక్తికరమైన ఆలోచనలు కూడా చర్చకు వచ్చాయి. కానీ ఆ తర్వాత నానా పాటేకర్ ఈ సినిమాకు ‘నో’ చెప్పారు. నానా పాటేకర్ అభిప్రాయం ప్రకారం.. ఈ పాత్రను చేయడానికి ఆయనకు ఆసక్తి లేదు. తన పాత్ర నచ్చకపోవడం వల్లే ఆ పాత్ర కోసం తక్కువ షూటింగ్ షెడ్యూల్‌ను కూడా కేటాయించడానికి ఆయన ఇష్టపడలేదు. క్రియేటివిటీ సంతృప్తికరంగా లేకపోవడమే ఆయన ఈ పాత్రను తిరస్కరించడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
నానా పాటేకర్‌కు కేవలం 15 రోజుల షూటింగ్ కోసం రూ.20 కోట్లను ఆఫర్ చేశారట. అంటే, ప్రతి రోజు రూ.1.3 కోట్ల రూపాయలు లభించేవి. కానీ నానా పాటేకర్ ఆ పాత్రను చేయడానికి నిరాకరించారు. ఆయన డబ్బు కంటే క్రియేటివి సంతృప్తిని కోరుకుంటున్నారు. అయితే, రాజమౌళి దర్శకత్వంలో తనకు వేరే ఏదైనా మంచి పాత్ర లభిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు.
రాజమౌళి తన ఇతర సినిమాల మాదిరిగానే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను కూడా రహస్యంగా ఉంచుతున్నారు. అందుకే సినిమా సెట్ నుండి ఏ వివరాలు బయటకు రాకుండా ఉండటానికి, కాస్ట్, క్రూ అందరితో NDA (Non-Disclosure Agreement)పై సంతకాలు చేయించారు. ఈ సినిమా 2027 నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నారు.