https://oktelugu.com/

Rajamouli-Mahesh Babu movie : రాజమౌళి మహేష్ బాబు మూవీ సెకండ్ షెడ్యూల్ లో పాల్గొనే నటులు వీళ్లేనా..?

Rajamouli-Mahesh Babu movie  : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి రాజమౌళికి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఆయన చేసిన అన్ని సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ సినిమాగా రాబోతోంది...

Written By: , Updated On : April 2, 2025 / 10:08 PM IST
Rajamouli Mahesh Babu Movie

Rajamouli Mahesh Babu Movie

Follow us on

Rajamouli-Mahesh Babu movie  : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం సీనియర్ హీరోలందరు భారీ సక్సెస్ లను సాధిస్తుంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం ఇప్పుడు పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ నేపథ్యంలో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళితో చేస్తున్న సినిమాతో ఆయన పాన్ వరల్డ్ స్టార్ హీరోగా మారిపోబోతున్నాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసుకున్న చిత్ర యూనిట్ తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ని కూడా స్టార్ చేయాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే సెకండ్ షెడ్యూల్లో మహేష్ బాబు తో పాటు కొంతమంది బాలీవుడ్ నటులు టాలీవుడ్ లోని స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపును సంపాదించుకున్న ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి నటులు కూడా నటించబోతున్నట్టుగా సమాచారమైతే అందుతుంది. ఈ షెడ్యూల్ సినిమాకి కీలకంగా మారబోతుందట. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ఇండియాలో ఉన్న టాప్ స్టార్స్ అందరూ నటించబోతున్నారనే సమాచారమైతే అందుతుంది. ఇక మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయటకు లీక్ అవ్వకుండా చూసుకుంటున్నాడు.

Also Read : మ్యాడ్ స్క్వేర్’ డైరెక్టర్ తో నవీన్ పోలిశెట్టికి ఇంత పెద్ద గొడవ జరిగిందా!

కాబట్టి ఈ సినిమాతో ఒక గొప్ప కథను ప్రేక్షకులకు చూపించడానికి ఆయన సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. నిజానికైతే రాజమౌళి చేసే ప్రతి సినిమాకి సంబంధించిన స్టోరీని ముందుగానే చెప్పి దానికి సంబంధించిన విజువల్స్ ని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటాడు.

కానీ ఆ ఫార్మాట్ కి పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే గొప్ప సినిమాగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదట. ఇలాంటి సినిమాని ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మనం ఎప్పుడు చూడలేదు అంటు మేకర్స్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది…

మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు అది ఈజీగా ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ సినిమా కూడా అదే బాటలో నడుస్తోంది. కాబట్టి భారీ సక్సెస్ ని సాధించి ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలని అతని అభిమానులతో పాటు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు…

Also Read : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరో అజిత్..ఫ్యాన్స్ కన్నీళ్లు!