spot_img
Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli Mahabharata: రాజమౌళి మహాభారతం లో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన జక్కన్న......

SS Rajamouli Mahabharata: రాజమౌళి మహాభారతం లో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన జక్కన్న… ఆనందపడుతున్న నమ్రత…

SS Rajamouli Mahabharata: దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేసిన కూడా అదొక సంచలనంగా మారుతుంది. మహేష్ బాబు తో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు 5 గెటప్పుల్లో కనిపించబోతున్నాడనే ఒక హెంటైతే ఇచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ మారబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. దానికి తోడుగా పాన్ వరల్డ్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి అక్కడ కూడా అతనికి భారీ క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక అక్కడి హీరోలు సైతం రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే రాజమౌళి ఒక సినిమా కోసం ఎంతలా కష్టపడతాడు. ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడానికి ఆయన ఎంతవరకు కష్టపడతాడనే విషయం కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద తన రాజముద్ర ను వేసుకున్నాడు…

ఇక అలాంటి రాజమౌళి ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమా తర్వాత ‘మహాభారతం’ సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో ఇండియాలో ఉన్న ప్రతి నటుడు నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తోడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ గతంలో రాజమౌళి వాళ్ళ నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ సైతం క్లారిటీ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే మహేష్ బాబు రాజమౌళి తీయబోయే మహాభారతంలో శ్రీకృష్ణుని క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట. ఇక ఈ విషయాన్ని నమ్రత తో చెప్పి తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రాజమౌళి విజన్ ను నమ్రతకు వివరించారట. దాంతో నమ్రత క్యారెక్టర్ చేయించండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట… మొత్తానికైతే మహేష్ బాబు కృష్ణుడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు కృష్ణుడి అవతారంలో కనిపిస్తే బాగుంటుందని ఆనందపడిపోతుందట. రాజమౌళి మహాభారతం సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు. దానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుంది. ఈ సినిమాలో ఎవరెవరు ఏ క్యారెక్టర్ లో నటించబోతున్నారనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version