Rajamouli On NTR: రాజమౌళి-ఎన్టీఆర్ ల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి మొదలైంది. సీరియల్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 తో మూవీ డైరెక్టర్ అయ్యాడు. ఇక స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ కి హీరోగా రెండో చిత్రం. కొంచెం అటుఇటుగా ఒకేసారి జర్నీ మొదలైంది. రాజమౌళి అత్యధికంగా ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు చేశాడు. ఎన్టీఆర్ కూడా ఇన్ని సినిమాలు ఒక దర్శకుడితో చేసింది లేదు. వీరి కాంబోలో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్.
యమదొంగ సూపర్ హిట్ కాగా, ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆస్కార్ రేంజ్ కి వెళ్లారు. ఎన్టీఆర్ కి గ్లోబల్ ఇమేజ్ తెచ్చి పెట్టింది ఈ చిత్రం. ఎన్టీఆర్ గొప్ప నటుడని పొగిడే రాజమౌళి… ఓ సందర్భంలో కుంటి గుర్రంతో పోల్చాడు. ఆ మేటర్ ఏమిటో చూద్దాం. దర్శకుడు రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడు తన మొదటి సినిమా అనుభవం చెప్పుకొచ్చాడు.
స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి హీరోగా ప్రభాస్ అనుకున్నాను. కానీ కొన్ని కారణాలతో ఆయనకు చేయడం కుదర్లేదు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఫస్ట్ రోజు సెట్స్ లో ఎన్టీఆర్ ని చూసి నేను చాలా నిరాశ చెందాను. సరిగ్గా మూతి మీద మీసం లేదు. పొట్టిగా, బొద్దుగా ఉన్నాడు. నా ఫస్ట్ మూవీకి ఇలాంటి హీరో దొరికాడు ఏంటని తెగ బాధపడ్డాను. అయితే నేను ఛాలెంజెస్ ని అంగీకరిస్తాను. కుంటి గుర్రంతో సవారీ చేసి గెలిస్తే, ఆ మజా వేరు కదా అని భావించాను.
ఒకసారి షూటింగ్ మొదలయ్యాక ఎన్టీఆర్ పట్ల నా అభిప్రాయం మారిపోయింది. తారక్ ఎనర్జీ, యాక్షన్ స్కిల్స్ నన్ను మెస్మరైజ్ చేశాయి. అప్పుడు నేను మరింత ఉత్సాహంగా పని చేశాను, అని చెప్పుకొచ్చాడు. కాబట్టి మొదటి చూపులో ఎన్టీఆర్ పై రాజమౌళికి కుంటి గుర్రం అభిప్రాయం కలిగిందట. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా తెలియజేశాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ లో ఒకరు. అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరో..