Rajamouli Love Story: రాజమౌళి-రమాలది అన్యోన్య దాంపత్యం. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇంత గొప్ప హస్బెండ్ అండ్ వైఫ్ కాంబినేషన్ ఎక్కడా కనిపించదు. రమాను రాజమౌళి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే రమాకు పెళ్లి అయింది. అయితే ఆమెకు విడాకులు అయ్యాయి. కీరవాణి భార్య సొంత చెల్లెలు కావడంతో రాజమౌళికి ఎప్పటి నుండో పరిచయం ఉంది. అది ప్రేమగా మారడంతో వివాహమై కొడుకు ఉన్నప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన సక్సెస్ లో రమా పాత్ర ఎంతగానో ఉందని రాజమోళి పలు సందర్భాల్లో చెప్పాడు.
అయితే రాజమౌళి గతంలో ఒక హీరోయిన్ ని ప్రేమించాడట. ఆ హీరోయిన్ పట్ల అత్యంత అభిమానం కలిగి ఉండేవాడట. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడట. అయితే అది వన్ సైడ్ లవ్వేనట. ఆమెను కలవాలని, మాట్లాడాలని ఇంటి గోడ దూకిన సందర్భాలు ఉన్నాయట. ఈ విషయాలు కేవలం రాజమౌళి సన్నిహితులకు మాత్రమే తెలుసట. కెరీర్ బిగినింగ్ లో రాజమౌళి ఆ హీరోయిన్ కోసం అంతగా తాపత్రయ పడ్డాడట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ ప్రచారం ఉంది.
రాజమౌళి కూడా రమాను ప్రేమించక ముందు ఒకరిద్దరు అమ్మాయిలను ప్రేమించాను అన్నారు. అయితే అవి సఫలం కాలేదు, విఫలం అయ్యాయి. రమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక నాకు అన్నీ తానే అయ్యారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు, ఆదర్శాలు ఉన్న వ్యక్తి కూడా. రాజమౌళి భార్య రమాతో పిల్లల్ని కనలేదు. కూతురు మయూఖ దత్తత తీసుకున్న అమ్మాయి. ఇక కార్తికేయ రమా మొదటి భర్త సంతానం.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేయనున్న చిత్ర పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. 2024 ప్రారంభంలో ఈ భారీ చిత్రం పట్టాలెక్కనుంది. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది. అధికారిక ప్రకటన కూడా చేశారు. మహేష్ ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపిస్తాడని సమాచారం. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ కేటాయించారట. రాజమౌళి కెరీర్లోనే భారీ చిత్రంగా ఉండనుంది.