Rajamouli : చాలామంది దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. బాహుబలి (Bahubali) సినిమాతో ఎంటైర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారిన రాజమౌళి ఆ తర్వాత చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)…ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వచ్చే సినిమాల విషయంలో ఇండియన్ సినిమా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు(Mahesh Babu) తో ఆయన చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా యావత్ ప్రపంచం మొత్తాన్ని మెప్పించే విధంగా ఉండబోతుంది అంటూ ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక లీకేజ్ వీడియో అయితే బయటికి వచ్చింది. దానికి తగ్గట్టుగానే జాగ్రత్తలు తీసుకున్నప్పటికి లీకేజీ అనేది బయటకు వస్తూనే ఉన్నాయి.
Also Read : మహేష్, రాజమౌళి సినిమా కోసం ముంబైలో ఆస్తులను అమ్ముతున్న ప్రియాంక చోప్రా..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!
చిన్న సీన్ లే కావడం వల్ల పెద్దగా పోయేదేమీ లేదు కానీ ఇక మీదట చేయబోయే భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా ఎవరైనా లీక్ చేసినట్లయితే సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయంటూ రాజమౌళి ఈ లీకేజీల విషయంలో కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికి లీకేజీ ఏమైనా అవుతాయేమో అనే ఉద్దేశ్యంతో ఆయనకు చాలావరకు తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నారట…
అందువల్లే సినిమాను జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.అయితే ఈ సినిమాకి సంభందించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఆయన ముందే ఇచ్చుండాలి. కానీ రాజమౌళి ఈ సినిమా విషయంలో మాత్రం చాలా ప్రతి విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతూ ఏదో చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది… అందువల్లే ప్రేక్షకులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. మరి దీని వల్ల రాజమౌళి సినిమా అంటే ప్రతి ఒక్కరి అంచనాలు పెరిగిపోవడమే కాకుండా సినిమా ఎలా ఉండబోతుంది.?
జానరేంటి సినిమా స్టోరీ ఏంటి అనే రీతిలో ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నారు. అందువల్లే ఒక్క వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టిన కూడా కొన్ని మిలియన్ వ్యూస్ వస్తాయనే ఉద్దేశ్యంతో కొంతమంది వ్యక్తులు కావాలనే వీటిని లీక్ చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…చూడాలి మరి ఈ సినిమా నుంచి ఇంకా ఎన్ని లీక్ లు వస్తాయి. ఫైనల్ గా సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతుందనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి…
Also Read : రాజమౌళి-మహేష్ బాబు మూవీ ఎఫెక్ట్, అక్కడ హోటల్స్ ఫుల్, క్యూ కడుతున్న వందల మంది జనాలు!