Rajamouli : ఇక ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) మహేష్ బాబు(Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూట్ అయితే స్టార్ట్ అయింది. మరి ఆ షూట్ ఎక్కడ చేస్తున్నారు? ఎప్పుడు చేస్తున్నారు అనే దానిమీద సరైన క్లారిటీ ఇవ్వలేక పోయినప్పటికి షూటింగ్ అయితే రీసెంట్ గా స్టార్ట్ అయిందనే కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని రాజమౌళి తను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఎలాంటి లీకులు ఇవ్వకుండా ఒక్క చిన్న ఫోటోని కూడా రిలీజ్ చేయకుండా చాలా జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఇస్తే చాలు అన్నట్టుగా సోషల్ మీడియాలో రాజమౌళికి చాలా వరకు రిక్వెస్ట్ అయితే పెడుతున్నారు. కానీ ప్రయోజనం అయితే ఏమీ లేకుండా పోతుంది. ఈ సినిమా ‘ఇండియానా జోన్స్’ (Indiana Jones) తరహాలో ఒక అడవి నేపథ్యంలో తెరకెక్కబోతుందనే ఒక చిన్న క్లూ అయితే ఇచ్చారు. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే మొన్నటిదాకా ఈ సినిమాలో మలయాళం నటుడు అయిన పృధ్వీ రాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అనే వార్తలు వచ్చినప్పటికి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నారట.
దానివల్ల అతన్ని పక్కన పెట్టి ఆయన ప్లేస్ లో బాలీవుడ్ కండల వీరుడు ఆయన ‘జాన్ అబ్రహం’ ని ఈ సినిమాలో విలన్ గా తీసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ధూమ్ సినిమాలో ఆయన విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక అదే తరహాలో ఈ సినిమాలో కూడా మహేష్ బాబును ఢీకొట్టే పాత్రలో తను నటించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి… మరి ఏది ఏమైనా కూడా జక్కన్న ఎలాంటి ప్లాన్స్ వేస్తాడు అనేది ఎవరి ఊహలకైతే అందవు… కాబట్టి ఈ సినిమా కోసం ఆయన భారీ కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
దాని వల్లే ఆయన ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక 1000 కోట్ల కలెక్షన్స్ తో తెరకెక్కబోయే ఈ సినిమాని ఒక విజువల్ వండర్ గా తరికెక్కించాలని చూస్తున్నాడు… మరి జాన్ అబ్రహం ఈ సినిమాలో ఉంటాడా ఉండడా అనే దానిమీద రాజమౌళి అధికారికంగా ప్రకటన చేయాల్సిన అవసరమైతే ఉంది.