Rajamouli- Shriya Saran: బాహుబలి సిరీస్ తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని వేరే లెవెల్ కి తీసుకెళ్లి ప్రపంచ నలుమూలల మన మార్కెట్ ని విస్తరింపచేసిన దర్శకుడు రాజమౌళి..ఆయన దర్శకత్వం లో ఈ ఏడాది విడుదలైన #RRR చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలుసు..మన తెలుగు సినిమాకి పాన్ వరల్డ్ మార్కెట్ ని తెచ్చిపెట్టింది ఈ సినిమా..ఇప్పుడు క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్స్ అందరూ తమ టాలెంట్ ని ప్రపంచం మొత్తానికి చూపించుకుని అరుదైన అదృష్టం ని కలిపించిన ఘనుడు రాజమౌళి మాత్రమే.

అలాంటి మనిషికి ఏ చిన్న హాని కలిగిన మన తెలుగు సినిమా ప్రతిష్టకు భంగమే..కానీ #RRR సినిమా షూటింగ్ సమయం లోనే రాజమౌళి చాలా సార్లు తీవ్రమైన అస్వస్థతకి గురైయ్యాడు అట..ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ఆయనకీ ఆస్తమా సమస్యలు తలెత్తాయట..ఇందులో రామ్ చరణ్ కి అమ్మ గా నటించిన ప్రముఖ హీరోయిన్ శ్రియా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాలను వెల్లడించింది.
ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..#RRR మూవీ సెట్స్ లో చాలా దుమ్ముతో కూడిన వాతావరణం ఉండేదని..అసలే ఆస్తమా తో ఇబ్బంది పడుతున్న రాజమౌళి గారు చాలా సార్లు తీవ్రమైన అస్వస్థతకి గురైయ్యడని..అస్వస్థతోనే ఆయన షూటింగ్ లో కూడా పాల్గొని చాలా కష్టపడ్డాడంటూ చెప్పుకొచ్చింది శ్రియా.

సెట్స్ లోకి వచ్చే ఓపిక లేక అసిస్టెంట్ డైరెక్టర్స్ తో పనులు చేయించుకునే దర్శకులు ఉన్న ఈరోజుల్లో..ఇండియా లో నెంబర్ 1 డైరెక్టర్ గా కొనసాగుతూ కూడా, ఇంతటి డేడికేషన్ చూపించడం అంటే మాములు విషయం కాదు..అందుకే రాజమౌళి కి ఇంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి..రాజమౌళి లాగా డెడికేషన్ అందరూ డైరెక్టర్లు చూపించి ఉంటె మన టాలీవుడ్ ఎప్పుడో హాలీవుడ్ తో పోటీపడేదని నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు..రాజమౌళి తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే..వచ్చే ఏడాది లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.