Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వచ్చాడు. ఇక బాహుబలి, త్రిబప్ ఆర్ సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ అయితే ఏర్పడింది. ఇక ఆ రెండు సినిమాలు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నందుకు ఒక రకంగా సంతోషంగా ఉన్నప్పటికి, చిన్న సినిమాలకు ఆదరణ దక్కకుండా చేస్తున్నందుకు బడగాను ఉంది. నిజానికి రాజమౌళి భారీ ఎత్తున సినిమాలు చేయడం వల్లే చిన్న సినిమాలను ఎవరు పట్టించుకోవడం లేదు.
Also Read: లిటిల్ హార్ట్స్’ చిత్రానికి ముందు ‘మౌళి’ నెల సంపాదన ఎంతో ఉండేదో తెలుసా..?
దానివల్ల చిన్న ప్రొడ్యూసర్లకి విపరీతమైన నష్టాలైతే వస్తున్నాయి. ఇక ఈ విషయంలో మాత్రం రాజమౌళి చాలా వరకు తప్పు చేశాడు అంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఎల్లలు దాటి ముందుకు తీసుకెళ్లడంలో హీరో అనిపించుకున్న రాజమౌళి, చిన్న నిర్మాతల విషయంలో మాత్రం విలన్ గా మారిపోయాడు.
నిజానికి చిన్న నిర్మాతలు మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తే బాగుంటుంది. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేస్తే ఎవరు చూడరు మంచి సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా ను చూడటానికి ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. ప్రేక్షకుడికి నచ్చని సినిమాలు చేసి వాళ్ళను థియేటర్ కి రమ్మంటే ఎవరిస్తారు.
మీరు చేసిన తప్పుకి రాజమౌళిని ఎందుకు తప్పుపడుతున్నారు అంటూ కొంతమంది రాజమౌళి అభిమానులు సైతం ఈ విషయం మీద సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా చిన్న నిర్మాతలు పెద్ద సక్సెస్ లను సాధిస్తే తప్ప వాళ్లకు ప్రాఫిట్స్ అయితే రావడం లేదు. ఇక అందరూ అదే ధోరణిలో మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది…