
దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తుండగా ‘ఆచార్య’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడేంటి? అనుకుంటున్నారా? అవునండీ.. నిజంగానే ‘ఆచార్య’కు రాజమౌళినే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మెగాస్టార్ చిరంజీవే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: డ్రగ్స్ కేసులో రకుల్ నలుగురు స్టార్ల పేర్లు బయటపెట్టిందా?
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమురంభీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రాంచరణ్ యాక్షన్ కు ఎన్టీఆర్ డైలాగ్స్ తోడవడంతో ఈ టీజర్ విడుదలైన కొద్ది క్షణాల్లో ట్రెండింగులోకి దూసుకెళ్లి రికార్డులను తిరగరాసింది.
ఇక కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్లలో ‘ఆచార్య’ మూవీతో తెరకెక్కుతోంది. ఈ మూవీని రాంచరణ్ మ్యాట్నీ మూవీతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ‘ఆచార్య’లో రాంచరణ్ గెస్ట్ అప్పీయన్స్ ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత రాంచరణ్ పాత్ర దాదాపు 40 నిమిషాలపాటు ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న రాంచరణ్ జక్కన్న పర్మిషన్ తో ‘ఆచార్య’ నటిస్తున్నాడని తెలుస్తోంది.
‘ఆచార్య’కు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్స్ విషయంలో రాంచరణ్ డేట్స్ క్లాష్ కాకుండా జక్కన్న చూసుకుంటానని చెప్పినట్లు చిరంజీవి తెలిపారు. జక్కన్న సహకారంతోనే రాంచరణ్ ‘ఆచార్య’లో నటించేందుకు రెడీ అవుతున్నాడని తెలిపారు. రాంచరణ్ కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించేందుకు ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ సన్నాహాలు చేశారని మెగాస్టార్ తెలిపారు. రాంచరణ్, నేను కలిసి నటించాలని తన భార్య సురేఖ కోరిక అని చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: ట్రైలర్ టాక్: ‘దిశ’ హత్యోదంతంను కళ్లకు కట్టారు!
త్వరలోనే రాంచరణ్ షూటింగులో పాల్గొంటారని చిరంజీవి తెలిపారు. చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ రెండోసారి నటిస్తోంది. ‘ఖైదీ-150’లోనూ కాజల్ అగర్వాల్ చిరుకు జోడిగా నటించింది. ఈ సినిమా టాలీవుడ్లో కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. దీంతో మరోసారి కాజల్ అగర్వాల్ చిరు సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇక రాంచరణ్ జోడీగా రష్మిక మందన్న నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంగీత దర్శకుడు మణిశర్మ చాలారోజుల తర్వాత చిరంజీవి సినిమా అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.