Rajamouli Mahesh Movie: టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ సినిమాల హవా నడుస్తోంది. బాలీవుడ్ సైతం షాక్ అయ్యే రేంజ్ లో తెలుగు సినిమా బడ్జెట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో భారీ బడ్జెట్ సినిమా రాబోతుందనే విషయం తెలిసిందే, RRR సినిమాతో గ్లోబల్ స్థాయికి చేరుకున్న రాజమౌళి ఈసారి హాలీవుడ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గ స్టోరీ ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ తరహా కథలతో మహేష్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అమెజాన్ అడవులు నేపథ్యంలో కథని డిజైన్ చేస్తున్నట్లు కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇది వరకే వెల్లడించాడు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్టోరీని ఈ ఏడాది డిసెంబర్ నాటికి లాక్ చేసి, మహేష్ బాబుకు ఫైనల్ నేరేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
రాజమౌళి ఒక్కసారి స్టోరీని లాక్ చేస్తే దాదాపు దానిని చేంజ్ చేసే అవకాశమే లేదు. అప్పటికప్పుడు సన్నివేశాన్ని బట్టి చిన్న చిన్న డెవలప్మెంట్ చేయటం తప్ప, స్టోరీ లైన్ ను మార్చే ప్రసక్తే లేదు. ఒన్స్ స్టోరీ లాక్ అయితే దానికి తగ్గట్టు హీరో మేకోవర్ ఎలా ఉండాలి, ఎలా కనిపించాలి అనే దానిపై రాజమౌళి దృష్టి పెడుతాడు. అందులో భాగంగా డిసెంబర్ నుండి దాదాపు మూడు నెలలు సినిమాకు సంబంధించి వర్క్ షాప్స్ జరిగే అవకాశం ఉందని, దానికి సంబంధించి మహేష్ బాబు కు ఇప్పటికే రాజమౌళి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ లోపు మహేష్ బాబు తాను చేస్తున్న గుంటూరు కారం సినిమా పూర్తి చేసి, డిసెంబర్ నాటికి రాజమౌళి వర్క్ షాప్స్ లో భాగం అయ్యే అవకాశం ఉంది. మహేష్ బాబు- జక్కన్న కాంబో లో రాబోతున్న ఈ సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఇండియా బిగ్గెస్ట్ మూవీ కి ఉండబోతుందని తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా 2025 కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అక్కడ ఉంది జక్కన్న, సినిమా అనుకున్న స్థాయిలో వచ్చేవరకు చెక్కుతూనే ఉంటాడు సో రిలీజ్ తేదీ పై అప్పుడే ఒక అంచనాకు రాలేము. కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన పనులు ఈ ఏడాది మొదలుకావడం మహేష్ ఫ్యాన్స్ కు శుభవార్త అని చెప్పాలి