https://oktelugu.com/

Akhil Akkineni : అఖిల్ కోసం రంగంలోకి రాజమౌళి!

కార్తికేయ తండ్రి రాజమౌళిని స్క్రిప్ట్ డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాడని సమాచారం. రాజమౌళి తన అనుభవంతో విలువైన సలహాలు ఇస్తున్నాడట.

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2023 / 08:17 PM IST
    Follow us on

    Rajamouli – Akhil Akkineni : అక్కినేని వారసుడు అఖిల్ కి బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వర్కవుట్ కావడం లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్ళు దాటిపోయింది. సపోర్ట్ చేసే అక్కినేని అభిమానులు ఉన్నప్పటికీ చిత్రాల ఎంపికలో తడపబడుతున్నాడు. ఐదు చిత్రాలు చేస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. అది కూడా ఓ మోస్తరు విజయం మాత్రమే. ఆయన గత చిత్రం ఏజెంట్ ఉన్న ఇమేజ్ ని కూడా దెబ్బ తీసింది. తలాతోకా లేకుండా ఇష్టం వచ్చినట్లు తీసి జనాల మీదకు వదిలారు. ఏజెంట్ విషయంలో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

    నాగార్జున సైతం అఖిల్ కెరీర్ విషయంలో ఆందోళన చెందుతున్నాడు. నాగ చైతన్య కనీసం టైర్ టు హీరోల జాబితాలో చేరాడు. అఖిల్ మాత్రం హిట్ వేటలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో రాజమౌళి రంగంలోకి దిగాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అఖిల్ నెక్స్ట్ దర్శకుడు అనిల్ కుమార్ తో మూవీ చేస్తున్నాడట. అనిల్ కుమార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో మూవీ దర్శకత్వ శాఖలో పని చేశాడట.

    ఇక అఖిల్ రాజమౌళి కొడుకు కార్తికేయకు బాగా క్లోజ్ అట. వీరిద్దరితో అనిల్ కుమార్ కి మంచి సాన్నిహిత్యం ఉందట. హీరో కాకముందే కార్తికేయ డైరెక్షన్ లో అఖిల్ ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడట. అయితే దాన్ని విడుదల చేయలేదు. అనిల్ కుమార్-అఖిల్ మూవీ స్క్రిప్ట్ పనులు కార్తికేయ చేసుకుంటున్నాడట. కార్తికేయ తండ్రి రాజమౌళిని స్క్రిప్ట్ డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాడని సమాచారం. రాజమౌళి తన అనుభవంతో విలువైన సలహాలు ఇస్తున్నాడట. అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి రంగంలోకి దిగిన నేపథ్యంలో నెక్స్ట్ అఖిల్ కి హిట్ గ్యారంటీ అంటున్నారు.

    2015లో వివి వినాయక్ తో అఖిల్ ని భారీగా లాంఛ్ చేశారు. అఖిల్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం దారుణ పరాజయం చవి చూసింది. అనంతరం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో మూవీ చేశారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా హలో విడుదలైంది. మిస్టర్ మజ్ను సైతం నిరాశపరిచింది. ఇక ఏజెంట్ ఫలితం తెలిసిందే.