Raja Vikramarka Movie: యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న “రాజా విక్రమార్క” సినిమాతో దర్శకుడిగా శ్రీ సరిపల్లి ఇండస్ట్రి కి పరిచయం అవుతున్నారు. అమెరికాలో ఫిలిం మేకింగ్ కోర్స్ చేసిన ఆయన అక్కడ కొన్ని ఇండిపెండెంట్ సినిమాలకు వర్క్ చేశారు. ఆ తర్వాత వీవీ వినాయక్ దగ్గర ‘నాయక్’, ‘అల్లుడు శీను’ సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశారు. కాగా ఇప్పుడు ‘రాజా విక్రమార్క’తో దర్శకుడిగా మారుతున్నారు. ఇందులో తొలుత యంగ్ హీరోలలో ఎవరితో నైనా తీద్దామని అనుకున్నారట సరిపల్లి. ఆర్ఎక్స్ 100 చిత్రం చూశాక కార్తికేయ లుక్స్ బావున్నాయని అనుకున్నాను. అందుకే కార్తికేయకు కధ కేప్పి నచ్చడంతో మా కాంబినేషన్ కుదిరింది అని చెప్పారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాతో మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణకు ఓ సంబంధం ఉంది అని చెప్పారు. శ్రీ సరిపల్లి సీబీఐ కాలనీ పక్కన ఉండేవారట. ఆయన ఇంటి కిటికీ నుంచి ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు కనిపిస్తుండేది అంట. ఆ ఆఫీసర్ డ్రైవర్ లేదా చిన్న పోస్టులో పని చేస్తారని అనుకున్నాను అన్నారు. కానీ తర్వాత లక్ష్మీనారాయణ గారి బృందంలో ఆయన ఇంపార్టెంట్ పర్సన్ అని తెలిసింది. నేను అనుకున్నట్టు ఆయన గురించి చాలామంది అనుకుని ఉంటారు కదా అని తెలిపారు. అలా లక్ష్మీనారాయణ బృందంలో వ్యక్తి ‘రాజా విక్రమార్క’లో హీరో పాత్రకు స్ఫూర్తిగా మారారు అని వెల్లడించారు. ఈ చిత్రాన్ని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీచిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. అలానే మూవీ లో హీరోయిన్ గా తాన్యా రవిచంద్రన్ నటిస్తుంది. ఈ సినిమా నవంబర్ 12 న విడుదల కానుంది.