Raja Saab Vs mana Shankara Varaprasad Garu: 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మొన్నటి వరకు సంక్రాంతి బరిలో 5 సినిమాలే బరిలో నిలుస్తున్నాయి అనుకున్నప్పటికి ఇప్పుడు తమిళ్ విజయ్ హీరోగా వస్తున్న జననాయక్ సినిమాను సైతం తెలుగులో రిలీజ్ చేయాలనే సన్నాహాలు చేస్తున్నారు… ఏ సినిమా పరిస్థితి ఎలా ఉన్నా కూడా ముఖ్యంగా చిరంజీవి – ప్రభాస్ ల మధ్య ఈ సంక్రాంతికి భీకరమైన పోటీ కొనసాగిపోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి కమర్షియల్ సినిమాలని చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు అతనికి ఏ మాత్రం సక్సెస్ ను కట్టబెట్టలేకపోతున్నాయి. కాబట్టి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తే అతనికి భారీ సక్సెస్ దక్కుతోంది. అలాగే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ని కొల్లగొట్టొచ్చనే ఉద్దేశ్యంతోనే ఆయన ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా రావడం ఒక విశేషమైతే చిరంజీవి ఇందులో యంగ్ లుక్ లో కనిపించడం మరో విశేషం…ఇక చిరంజీవికి తోడుగా వెంకటేష్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటం ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణగా నిలుస్తోంది…ఈ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్టయితే ఈ సినిమా 400 కోట్లు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది…
ఇక ప్రభాస్ సైతం రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దానివల్ల ఈ సినిమా మీద ప్రేక్షకులకు అంచనాలైతే లేకుండా పోయాయి. ఇక రాజాసాబ్ సినిమా మీద ప్రభాస్ కి సైతం పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికి ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కాబట్టి ఏదైనా మ్యాజిక్ జరిగితే ప్రభాస్ ఈ సినిమాతో 600 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడతాడు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను బట్టి చూస్తే చిరంజీవి కంటే ప్రభాస్ టాప్ రేంజ్ లో ఉన్నప్పటికి అతను కమర్షియల్ డైరెక్టర్ తో అందులోనూ స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేని మారుతి డైరెక్షన్ లో సినికా చేశాడు. కాబట్టి ఈ సినిమా కొంతవరకు తేడాగా ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి. చిరంజీవి ప్రభాస్ ఇద్దరి మధ్య బీకరమైన పోటీ ఉంటుంది. ఈ సంక్రాంతి ఎవరికి సక్సెస్ ని కట్టబడుతోంది అనేది చూడడానికి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…