NTR And Allu Arjun: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) సినిమా గురించి ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి… ఇక ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా అంటే మామూలు విషయం కాదు. కేజీఎఫ్ సిరీస్, సలార్ లాంటి రెండు వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించిన ఆయన ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన మరోసారి 2000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానికి తోడుగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్టును కూడా లాగేసుకున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దీనికి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మీద కోపంతో ఉన్నాడట.
దాంతో తనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టి తమ స్టార్ డమ్ ఏంటో నిరూపించుకుంటానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, అటు అల్లు అర్జున్ అభిమానులు సైతం ఈ విషయం మీద ఫ్యాన్ వార్ చేస్తున్నారు.
నిజానికి పుష్ప 2 తో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన అల్లు అర్జున్ ను దేవర సినిమాతో కేవలం 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన ఎన్టీఆర్ ఏ రకంగా ఎదుర్కొంటాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి…ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కంటే అల్లు అర్జున్ చాలా ముందు వరుసలో ఉన్నాడు. ఆయన్ని ఢీ కొట్టడం మామూలు విషయం కాదు.
డ్రాగన్ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటే తప్ప అల్లు అర్జున్ ను ఢీ కొట్టే కలెక్షన్స్ అయితే రావు అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇప్పటివరకు డ్రాగన్ సినిమా షూటు అయినంత వరకు చాలా అద్భుతంగా వచ్చిందట. అందుకోసమే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సైతం ఈ సినిమాతో తన రేంజ్ ను పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…