Director Maruthi: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. తను అనుకున్నట్టుగానే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలందరికీ చెమటలు పట్టిస్తున్న ప్రభాస్ కొద్ది రోజుల్లో నెంబర్ వన్ హీరోగా అవతరిస్తాడు అనేది వాస్తవం…ప్రస్తుతం ఆయన లైనప్ కనక చూసినట్లయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. రాబోయే నాలుగు సంవత్సరాల వరకు ఆయన డేట్స్ మొత్తం ఫుల్ అయిపోయాయి. ఇప్పటికే సలార్, కల్కి లాంటి రెండు హిట్స్ తో మంచి ఊపు మీదున్న ఆయన ఇప్పుడు మారుతి డైరెక్షన్లో చేస్తున్న ‘రాజాసాబ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా సక్సెస్ సాధిస్తే దాంతో ప్రభాస్ మార్కెట్ మరింత పెరుగుతోంది.
లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ కొంతవరకు డల్ అవుతోంది. ఇక ఇదే సినిమా మీద నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న మారుతి ఈ సినిమా ఆడకపోతే మాత్రం ఆయన కెరియర్ షెడ్డుకి వెళ్లిపోతుందని చాలామంది విమర్శకులు సైతం అతన్ని విమర్శిస్తున్నారు. కారణం ఏంటి అంటే ఆయన వాడి రొటీన్ టెంప్లేట్ లోనే రాజాసాబ్ సినిమాను చేశాడు.
దానిమీద ఎవరికి పెద్దగా నమ్మకమైతే లేదు.
ఇక ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం లేదని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హర్రర్ కామెడీ నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. ప్రభాస్ లాంటి పెద్ద హీరోని పెట్టి అలాంటి ఒక చిన్న కాన్సెప్ట్ చేయించుకోవడం అనేది కరెక్ట్ కాదు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఈ సినిమా తేడా కొడితే మాత్రం మారుతికి మరో పెద్ద హీరో నుంచే అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు.
ఇక ఇలాంటి స్టార్ హీరో మారుతిని పిలిచి మరి అతనికి అవకాశం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇంతకు ముందు వరకు మారుతి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలను చేశాడు. కానీ మొదటిసారి ప్రభాస్ లాంటి స్టార్ హీరోని డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరొక 50 రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…