Raja Saab premiere shows collections: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) తర్వాత ఈమధ్య కాలం లో ఒక సూపర్ స్టార్ సినిమాకు ఆడియన్స్ ఇంతలా నిరుత్సాహానికి గురవ్వడం ఈ చిత్రానికే జరిగింది. అసలు ప్రభాస్ ఎందుకు ఈ సినిమాని ఒప్పుకున్నాడో అర్థం కావడం లేదంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా, ప్రభాస్ కి టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ని రాబట్టే సత్తా ఉంది. కానీ ఈ సినిమాకు అది కూడా జరగలేదు. ప్రీమియర్స్ షోస్ ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘హరి హర వీరమల్లు’ కంటే తక్కువ వచ్చాయి.
నైజాం లో ప్రీమియర్ షోస్ ని ప్లాన్ చేయడం లో నిర్మాతలు విఫలమయ్యారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ పూర్తిగా దెబ్బ పడింది, అందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ ఇవ్వకపోవడం వల్ల, చివరి నిమిషం వరకు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం ఒప్పుకోకపోవడం తో, 11 గంటల సమయం లో మామూలు టికెట్ రేట్స్ తో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ ని షెడ్యూల్ చేశారు. ఆ ప్రీమియర్ షోస్ నుండి కేవలం 51 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. నైజాం సంగతి పక్కన పెడితే, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం వెయ్యి రూపాయిల టికెట్ రేట్ తో చాలా గ్రాండ్ గానే ప్రీమియర్ షోస్ ని వేశారు. ఈ ప్రీమియర్ షోస్ నుండి 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ప్రీమియర్ షోస్ గ్రాస్ కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది అన్నమాట.
‘హరి హర వీరమల్లు’ కి ఆంధ్ర ప్రదేశ్, సీడెడ్ ప్రాంతాలకు కలిపి 12 కోట్ల 62 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘రాజా సాబ్’ చిత్రానికి మాత్రం కేవలం 7 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఎంత గ్యాప్ ఉందో మీరే చూడండి. కానీ కర్ణాటక ప్రాంతం లో మాత్రం ఈ చిత్రం ‘హరి హర వీరమల్లు’ గ్రాస్ ని దాటేసింది. అక్కడ ఆ చిత్రానికి కోటి 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , ‘రాజా సాబ్’ చిత్రానికి 2 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా రాజా సాబ్ చిత్రానికి 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒకవేళ తెలంగాణ లో భారీ రేట్స్ తో ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ వేసుంటే 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేవి ఏమో. అయినప్పటికీ కూడా ‘హరి హర వీరమల్లు’ కంటే తక్కువే ఉంటుంది. ఆ చిత్రానికి ఇండియా వైడ్ 19 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.