Raj Tarun- Manchu Vishnu: ట్రోల్స్ కి మంచు విష్ణు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. చివరకు సినిమా వాళ్లు కూడా ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ అహ నా పెళ్ళంట ట్రైలర్ విడుదల కాగా మంచు విష్ణును ట్రోల్ చేశారు. మోహన్ బాబు ఫ్యామిలీపై చాలా కాలంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్ కామెంట్స్ ని ట్రోల్ చేయడం చాలామందికి అలవాటుగా ఉంది. అలవాటు కంటే ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది. మంచు వారి కుటుంబాన్ని ట్రోల్ చేస్తూ బ్రతికేసే అనేక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి.

ఈ మధ్య ఇది మరింతగా ఎక్కువైంది. మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా మూవీ ఘోర పరాజయం చవి చూసింది. దానికి కారణం ట్రోల్స్ అంటూ మోహన్ బాబు ఫైర్ అయ్యారు. ఆయన లీగల్ యాక్షన్ కి సిద్ధమయ్యారు. ఇదే విషయమై మంచు విష్ణు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ నటుడు ఉద్దేశపూర్వకంగా తమపై ట్రోల్స్ కి పాల్పడుతున్నారని అన్నారు. పోలీసుల విచారణలో ఆ నటుడు ఆఫీస్ నుంచే ఇదంతా జరుగుతున్నట్లు ఆధారాలు లభించాయని మంచు విష్ణు ఆరోపణలు చేశారు.
అయితే ఆ నటుడు ఎవరో వెల్లడించలేదు. తాజాగా హీరో రాజ్ తరుణ్ మూవీలో మంచు విష్ణును ట్రోల్ చేశారు. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ అహ నా పెళ్ళంట ట్రైలర్ విడుదల కాగా… గతంలో మంచు విష్ణు… టంగుటూరి వీరేశం పకాహం పంతులు అని ఆవేశంలో తప్పుగా పలికారు. ఈ డైలాగ్స్ అహ నా పెళ్ళంట మూవీలో ఒక కమెడియన్ చేత చెప్పించారు. దీంతో మంచు విష్ణు పై సెటైర్ వేశారని క్లియర్ గా అర్థమైంది.

ఎవరో ముక్కూ ముఖం తెలియని వాళ్ళు ట్రోల్ చేశారంటే అర్థం వుంది. సినిమా వాళ్ళు నేరుగా ఇలాంటి ట్రోల్స్ కి పాల్పడటం ఆసక్తికరంగా మారింది. కాగా మంచు విష్ణు లేటెస్ట్ మూవీ జిన్నా సైతం ఆయన్ని నిరాశపరిచింది. పాజిటివ్ రివ్యూలు తెచ్చుకున్న జిన్నా కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. 50 లక్షల షేర్ రాబట్టలేక భారీ నష్టాలు మిగిల్చింది.