https://oktelugu.com/

Rahul Ramakrishna : ‘పిచ్చి పట్టిందా’ అంటూ రాహుల్‌ రామకృష్ణ పై నెటిజన్లు సీరియస్ !

Rahul Ramakrishna : కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణకి కాస్త తిక్క ఉంది.  ఇకపై సినిమాలు చేయనని ట్వీట్ చేసిన  ఈ నటుడు తాజాగా షాకిచ్చాడు. అది జోక్ అంటూ మరో ట్వీట్ చేశాడు. ‘నేను జోక్ చేశా. ఇంత రెమ్యునరేషన్, లగ్జరీ లైఫ్ ఎందుకు వదులుకుంటా? నేను రిటైర్మెంట్ ప్రకటించానని నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పడం నమ్మలేకపోతున్నా’ అని తెలిపాడు.  దీంతో రాహుల్ రామకృష్ణపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘పిచ్చి పట్టిందా’, ‘మస్త్ కామెడీ చేస్తున్నావులే’ ‘అతి చేయకు’ అని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 5, 2022 / 09:07 PM IST
    Follow us on

    Rahul Ramakrishna : కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణకి కాస్త తిక్క ఉంది.  ఇకపై సినిమాలు చేయనని ట్వీట్ చేసిన  ఈ నటుడు తాజాగా షాకిచ్చాడు. అది జోక్ అంటూ మరో ట్వీట్ చేశాడు. ‘నేను జోక్ చేశా. ఇంత రెమ్యునరేషన్, లగ్జరీ లైఫ్ ఎందుకు వదులుకుంటా? నేను రిటైర్మెంట్ ప్రకటించానని నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పడం నమ్మలేకపోతున్నా’ అని తెలిపాడు. 

    Rahul Ramakrishna

    దీంతో రాహుల్ రామకృష్ణపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘పిచ్చి పట్టిందా’, ‘మస్త్ కామెడీ చేస్తున్నావులే’ ‘అతి చేయకు’ అని ఫైరవుతున్నారు. అసలు రాహుల్ రామకృష్ణ  ఎప్పుడు ఎలా ఉంటాడో అతనికే తెలియదు. పైగా మనోడు మంచి డ్రింకర్ కూడా. కాస్త మత్తు ఎక్కువైతే.. ట్విట్టర్ లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు  పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తుంటాడు.  తాజాగా అలాంటి కామెంట్స్ పెట్టి..   మొత్తానికి ఈ రోజు  సినిమా  వార్తల్లో  హాట్ టాపిక్ అయ్యాడు.  

    Rahul Ramakrishna

    ‘అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు’ వంటి చిత్రాలతో రాహుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.   రాహుల్ రామకృష్ణ కమెడియన్‌గా, నటుడిగా తనేంటో  నిరూపించుకున్నాడు.   అయితే,  కెరీర్ లో  ఫుల్ క్రేజ్‌ సంపాదించుకుంటున్న సమయంలో సడెన్ గా ఇలాంటి  అనూహ్య చెత్త జోక్ లు చేస్తే కెరీర్ కే నష్టం. 

    కాగా   రాహుల్ రామకృష్ణ  సన్నిహితులు మాత్రం వాడు మాట మీద నిలబడే రకం కాదు అని  ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు.  రాహుల్ గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ నే చేశాడు. ఆ తర్వాత వెంటనే.. ఆ కామెంట్స్ పై మాట మార్చాడు.