https://oktelugu.com/

‘ఆర్‌ఆర్‌ఆర్’లో టాలెంటెడ్ కమెడియన్ కూడా కీలకమేనట !

నేటి జనరేషన్ కామెడీ టైమింగ్ ఉన్న తెలుగు కమెడియన్స్ లో రాహుల్ రామకృష్ణ శైలి భిన్నమైనది. తక్కువ టైంలోనే బెస్ట్ కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ మంచి పేరు తెచ్చుకున్నాడు. దానికి తగ్గట్టు రాహుల్ రామకృష్ణ కెరీర్ లోనే గొప్పగా చెప్పుకునే అతిపెద్ద అవకాశం ఆర్ఆర్ఆర్ రూపంలో వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న ఈ అత్యున్నత భారీ మల్టీస్టారర్ […]

Written By:
  • admin
  • , Updated On : December 9, 2020 / 04:50 PM IST
    Follow us on


    నేటి జనరేషన్ కామెడీ టైమింగ్ ఉన్న తెలుగు కమెడియన్స్ లో రాహుల్ రామకృష్ణ శైలి భిన్నమైనది. తక్కువ టైంలోనే బెస్ట్ కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ మంచి పేరు తెచ్చుకున్నాడు. దానికి తగ్గట్టు రాహుల్ రామకృష్ణ కెరీర్ లోనే గొప్పగా చెప్పుకునే అతిపెద్ద అవకాశం ఆర్ఆర్ఆర్ రూపంలో వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న ఈ అత్యున్నత భారీ మల్టీస్టారర్ లో రాహుల్ రామకృష్ణ స్నేహితుడి పాత్రలో నటిస్తున్నాడు. పైగా ఎన్టీఆర్ కి ఫ్రెండ్ రోల్ లో నటించబోతున్నాడు.

    Also Read: సునీత వయసు ఎంత.. రెండో పెళ్ళికి కారణమేంటి ?

    ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ లో ఈ రోజు జాయిన్ అయ్యాడు. రాహుల్ రామకృష్ణ పై ఓ కీలక సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. పైగా సినిమాలో ఎన్టీఆర్ కి ఫ్రెండ్ రోల్ అంటే మంచి క్యారెక్టరే అయి ఉంటుంది. సినిమా మొత్తం కనిపిస్తాడని.. ఎలాగూ సినిమాలో ఎక్కువ సీన్స్ ఎన్టీఆర్ వే కాబట్టి.. ఎన్టీఆర్ పక్కన ప్రతి సీస్ లో రాహుల్ ఉంటాడు కాబట్టి.. ఆ రకంగా రాహుల్ ది కూడా సినిమాకే అతి ముఖ్యమైన రోల్ అనుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

    Also Read ‘అల్లు స్నేహ’ వదిన ఆ గ్లాస్ దాచండి !

    కాగా ధృడంగా ఉండే కొమరం భీం రోల్ కోసం ఎన్టీఆర్ ఇప్పటికే లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు చేసి మరీ ఈ పాత్ర కోసం సన్నద్ధం అయ్యాడు. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటిసారి నటిస్తుండటంతో ఈ మల్టీస్టారర్ పై ఆరంభం నుండి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్