https://oktelugu.com/

Rahasyam Idham Jagath : ‘రహస్యం ఇదం జగత్’ ఫుల్ మూవీ రివ్యూ.

ఇక ఇప్పటివరకు హాలీవుడ్ లో వచ్చిన ఇన్సెప్షన్ లాంటి సినిమాలు వచ్చినప్పటికి తెలుగులో మాత్రం అలాంటి జానర్ లో ఫుల్ లెంత్ సినిమాలు మాత్రం రాలేదు. కాబట్టి ఈ చిన్న సినిమా లిమిటెడ్ బడ్జెట్ లో చాలా బెస్ట్ అటెంప్ట్ ఇచ్చారనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : November 9, 2024 6:35 pm

Rahasyam Idham Jagath

Follow us on

Rahasyam Idham Jagath Movie Review తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు మంచి కాన్సెప్ట్ లతో వచ్చి మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి… ఇక ఇలాంటి సమయంలోనే ‘రహస్యం ఇదం జగత్’ అనే సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ లో వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
 
కథ

ఈ సినిమా కథ విషయానికి వస్తే అకీరా (స్రవంతి) అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటుంది. తన తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు. అయితే ఒక సందర్భంలో ఆమె తండ్రి అనుకోకుండా మరణించడంతో తన తల్లి ఇండియాలో ఒకరే ఉంటారనే ఉద్దేశ్యంతో అకీరా అమెరికా నుంచి ఇండియా కి షిఫ్ట్ అవ్వాలని కోరుకుంటుంది…ఇక అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ అయిన అభి (రాకేష్) కూడా అకిరా కోసం ఇండియాకి రావాలని అనుకుంటాడు. ఇక ఈ క్రమంలోనే ఇండియాకి వెళ్ళిపోతున్నందు వల్ల తన ఫ్రెండ్స్ అందరికి చివరిసారిగా పార్టీ ఇవ్వాలని అభి అందరికి ఒక పార్టీ ఇస్తాడు. అందులో అకిరా అభి లతోపాటు అభిఫ్రెండ్స్ అయిన కళ్యాణ్ అరు అలాగే అకిరా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విశ్వ కూడా వస్తాడు…ఇక అక్కడ అనుకోకుండా విశ్వ అకిరా కళ్యాణ్ లను చంపేస్తాడు. దాంతో అభి ఏం చేశాడు. కథ అక్కడినుంచి ఎలాంటి మలుపులు తిరిగిందనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఇది సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన సినిమా కాబట్టి ఇందులో డిఫరెంట్ యాక్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ప్రేక్షకుడిని మైమరిపింపజేసే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఉండడమే కాకుండా టెక్నికల్ గా కూడా సినిమాని చాలా స్ట్రాంగ్ గా తీర్చిదిద్దారనే చెప్పాలి. అలాగే ఈ సినిమా మొత్తం సైన్స్ ఫిక్షన్ తోపాటు మైథాలాజికల్ గా కూడా చేసిన ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ ఎంచుకున్న పాయింట్ చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉండడంతో పాటుగా ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా చేశాడు. అలాగే సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ‘రహస్యం ఇదం జగత్’ అనే సినిమాని ఒక పర్ఫెక్ట్ సైన్స్ ఫిక్షన్ ఆర్డర్లో తీసుకొచ్చి తెలుగు ప్రేక్షకులకు విజువల్ గా కూడా ఫీస్ట్ అందించాడనే చెప్పాలి.

ఇక ఇప్పటివరకు హాలీవుడ్ లో వచ్చిన ఇన్సెప్షన్ లాంటి సినిమాలు వచ్చినప్పటికి తెలుగులో మాత్రం అలాంటి జానర్ లో ఫుల్ లెంత్ సినిమాలు మాత్రం రాలేదు. కాబట్టి ఈ చిన్న సినిమా లిమిటెడ్ బడ్జెట్ లో చాలా బెస్ట్ అటెంప్ట్ ఇచ్చారనే చెప్పాలి… ఫస్ట్ ఆఫ్ కొంతవరకు స్లోగా నడిచినప్పటికి, సెకండ్ హాఫ్ మాత్రం సినిమా పరుగు పెడుతుంది. అలాగే క్లైమాక్స్ లో సినిమా మొత్తానికి సంబంధించిన లింకులను రివిల్ చేసే సమయంలో ప్రతి ప్రేక్షకుడు కూడా ఒక హై ఫీల్ అవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక కొన్ని సీన్లు ఎలివేట్ చేయడానికి బిజిఎం అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వకపోయినప్పటికి సినిమాలో ఉన్న ఎమోషన్ ను బట్టి ఆడియన్ ఆ సినిమాకు కనెక్ట్ అవుతూ ఉంటాడనే చెప్పాలి…

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ కి మైథాలాజి ని కనెక్ట్ చేసిన విధానం కూడా చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో కూడా కొన్ని డ్రా బ్యాక్స్ ఉన్నప్పటికి సినిమా అవుట్ అండ్ అవుట్ ప్రేక్షకుడికి ఎంటర్ టైనింగ్ అందిస్తూనే ఉంటుందని చెప్పాలి.

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

హీరోగా చేసిన రాకేష్ పెర్ఫామెన్స్ విషయానికి వస్తే లీడ్ రోడ్ లో నటించిన రాకేష్ ఇంతకుముందు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించినప్పటికి ఫస్ట్ టైం ఫుల్ లెంత్ సినిమాలో నటించి ఇప్పుడు మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తన యాక్టింగ్ కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయిందస్ చెప్పాలి. ఇక సినిమాకు సంబంధించిన ఎలిమెంట్స్ లో తను చాలా బాగా యాక్టింగ్ చేసి మెప్పించాడు. ఇక హీరోయిన్ గా చేసిన స్రవంతి క్యారెక్టర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడంతో ఆమె అనుకున్న దాని కంటే నెక్స్ట్ లెవెల్లో పర్ఫామెన్స్ అయితే ఇచ్చిందనే చెప్పాలి… ఇక మిగతా ఆర్టిస్టులందరూ కూడా సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహిస్తూ నెక్స్ట్ లెవెల్ లో ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేశారు…

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాకి మ్యూజిక్ అందించిన గ్యాని ఒకే అనిపించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఇక సినిమాటోగ్రాఫర్ టైలర్ బ్లుమెల్ అందించిన విజువల్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి…ఇక ఎడిటర్ చోట కే ప్రసాద్ కూడా చాలా షార్ప్ ఎడిట్ చేసే ప్రయత్నం చేశారు…

ప్లస్ పాయింట్స్

కథ, స్క్రీన్ ప్లే
రాకేష్ యాక్టింగ్
సైన్స్ ఫిక్షన్ కి మైథాలజీ కథను సెట్ చేయడం…

మైనస్ పాయింట్స్

బిజీఎం
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ గా ఉన్నాయి…

రేటింగ్

ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

చివరి లైన్

సైన్స్ ఫిక్షన్ జానర్ లో వచ్చిన తెలుగు సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ….

Rahasyam Idham Jagath Trailer | Komal R Bharadwaj |Gyaani | Rakesh Galebhe| Sravanthi Prattipati