https://oktelugu.com/

Raghava Lawrence : రాఘవ లారెన్స్ కు భయంకరమైన వ్యాధి.. అసలు నిజం బయటపెట్టడంతో సంచలనం

మొత్తంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి తగ్గిపోవడంతో లారెన్స్ కూడా రాఘవేంద్ర స్వామిని పూజిస్తారట. ఇప్పటికీ ఆ స్వామి మాల వేస్తుంటారట. ఇలా తల్లి స్ఫూర్తితోనే పెద్దగ అయిన తర్వాత ట్రస్ట్ పెట్టాలనుకున్న లారెన్స్ తన కల నెరవేర్చుకున్నారు. తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు రాఘవ లారెన్స్.

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2023 / 03:34 PM IST
    Follow us on

    Raghava Lawrence : లారెన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య హారర్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఫుల్ సందడి చేస్తున్నారు. అంతేకాదు తెలుగు, తమిళ భాష సినిమాలకు దర్శకుడిగా, కొరియోగ్రఫర్, నటుడిగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు లారెన్స్. ఇప్పటికీ ఏ మాత్రం గ్రేస్ తగ్గకుండా అభిమానులను సంతోసపెడుతుంటాడు. ఇలా లారెన్స్ కేవలం నటుడిగానే కాదు ఎన్నో విధాలుగా ఇండస్ట్రీలో ఆయనకంటూ స్పెషల్ ముద్ర వేసుకున్నారు.

    లారెన్స్ మొట్టమొదటగా తన కెరీర్ ను కొరియోగ్రఫర్ గానే ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి దర్శకుడిగా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కేవలం ఇండస్ట్రీ పరంగా మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సంపాదించారు. ఈయన తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తుంటారు. చిన్నారులను ఆదరించి వారికి మంచి భవిష్యత్తు అందించడమే కాకుండా ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఉచిత ఆపరేషన్ చేయించి పునర్జన్మను ఇచ్చారు. అనాధ పిల్లలను చేరదీసి చదువు చెప్పిస్తూ.. వారి మంచి చెడులను కూడా చూస్తుంటారు లారెన్స్. ఇలా ఎన్నో మంచి పనులు చేస్తున్న లారెన్స్ చిన్నతనంలో ఓ ప్రమాదకరమైన వ్యాధితో బాధ పడ్డారట.

    లారెన్స్ చిన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనే భయంకరమైన వ్యాధితో బాధ పడ్డారట. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి తన తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఎన్నో చోట్ల చికిత్స చేయించినా వ్యాధి నయం కాలేకపోయిందట. ఆ తర్వాత లారెన్స్ తల్లి రాఘవేంద్ర స్వామిని కొలిచిందని.. దీంతో తనకు ఆ సమస్య తగ్గిపోయిందని టాక్. రాఘవేంద్ర స్వామి ఆశీస్సుల వల్లే లారెన్స్ బ్రెయిన్ ట్యూమర్ నుంచి బయట పడ్డారని అంటుంటారు. అందుకే ఈయన పేరు కూడా రాఘవ లారెన్స్ గా మార్చారట.

    మొత్తంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి తగ్గిపోవడంతో లారెన్స్ కూడా రాఘవేంద్ర స్వామిని పూజిస్తారట. ఇప్పటికీ ఆ స్వామి మాల వేస్తుంటారట. ఇలా తల్లి స్ఫూర్తితోనే పెద్దగ అయిన తర్వాత ట్రస్ట్ పెట్టాలనుకున్న లారెన్స్ తన కల నెరవేర్చుకున్నారు. తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు రాఘవ లారెన్స్.