Radhika Apte: బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే ఆరోపణలు సంచలంగా మారుతున్నాయి. తాజాగా ఆమె తన ఎద భాగం, పెదవులు చిన్నగా ఉన్నాయనే కారణంతో ఓ సినిమాకు రిజెక్ట్ చేయబడ్డానని చెప్పింది. తెలుగులో రాధికా నటించింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో విడుదలైన బాలయ్య బ్లాక్ బస్టర్ లెజెండ్ మూవీలో రాధికా ఆఫ్టే నటించడం జరిగింది. ఆ సినిమా రాధిక ఆఫ్టేకు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర, రక్త చరిత్ర 2 చిత్రాల్లో రాధికా నటించి మెప్పించారు. ఇక రజినీకాంత్ సెన్సేషనల్ మూవీ కబాలి చిత్రంలో రాధికా నటించిన విషయం తెలిసిందే. సౌత్ లో ఆమెకు డిమాండ్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో అక్కడే సెటిల్ అయ్యారు. లస్ట్ స్టోరీస్ నెట్ఫ్లిక్స్ సిరీస్ లో రాధికా బోల్డ్ రోల్ చేశారు. ఇక ‘ది వెడ్డింగ్ గెస్ట్’ మూవీలో నగ్నంగా నటించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. టాలెంటెడ్ అండ్ బోల్డ్ యాక్ట్రెస్ గా రాధికా ఓ సపరేట్ ఇమేజ్ కలిగి ఉన్నారు.
కాగా ఆమె తాజా కామెంట్స్ బాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. ఆమెకు ఎద భాగం, పెదాలు చిన్నగా ఉన్నాయని ఓ మూవీకి రిజెక్ట్ చేశారట. ఆమె స్థానంలో ఎద, పెదాలు పెద్దగా ఉన్న మరో నటిని తీసుకున్నారట. ఆ శరీర భాగాలు పెద్దగా ఉండడం వలన ఆమె సెక్సీగా కనిపిస్తుంది. అందుకే ఆమె డిమాండ్ ఉంటుందని వారు ఆమెతో అన్నారట. నమ్మిన వాళ్లు, సన్నిహితులు కూడా తన పట్ల అలా ఆలోచించడంతో చాలా ఆవేదనకు గురైనట్లు తెలియజేసింది.
ఇంతకు ముందు కూడా రాధికా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. పరిశ్రమకు వచ్చిన కొత్తలో పలు సందర్భాల్లో కొందరు వ్యక్తులు ఎద భాగానికి, పిరుదులకు, కళ్ళకు, ముక్కుకు, బుగ్గలకు సర్జరీలు చేయించుకోమని సలహాలు ఇచ్చారన్నారు. అయితే కృత్రిమ అందం ఇష్టపడని నేను వాళ్ళ సలహాలు పాటించలేదు. నన్ను నన్నుగా ప్రేమించడం మొదలుపెట్టాను. అలాంటి వ్యక్తుల కామెంట్స్ నన్ను ఇంకా దృఢంగా మార్చయని రాధికా ఆఫ్టే చెప్పుకొచ్చారు. నిజానికి గ్లామర్ ఇండస్ట్రీలో ఇవన్నీ సహజం. శ్రీదేవి లాంటి అందగత్తెలు కూడా కొన్ని సర్జరీలు చేయించుకున్నట్లు సమాచారం ఉంది. కెరీర్ కోసం చాలా మంది హీరోయిన్స్ సర్జరీల బాట పడతారు.
Also Read:Virata Parvam: విరాటపర్వం నుండి క్రేజీ అప్డేట్.. రానా పాడితే ఎలా ఉంటుందో చూడండి!