https://oktelugu.com/

Radhesyam అప్డేట్: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్

‘బాహుబలి’ దెబ్బకు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంది. సాహో అంతంత మాత్రంగానే ఆడినా కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఆ క్రమంలోనే పూర్తి డిఫెరెంట్ గా ప్రభాస్ తన తదుపరి చిత్రంగా ప్రేమకథను ఎంచుకున్నాడు. కే.రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ మూవీ రూపొందింది. ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని జూలై 30న విడుదల చేయాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. షూటింగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2021 / 09:45 AM IST
    Follow us on

    ‘బాహుబలి’ దెబ్బకు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంది. సాహో అంతంత మాత్రంగానే ఆడినా కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఆ క్రమంలోనే పూర్తి డిఫెరెంట్ గా ప్రభాస్ తన తదుపరి చిత్రంగా ప్రేమకథను ఎంచుకున్నాడు.

    కే.రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ మూవీ రూపొందింది. ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని జూలై 30న విడుదల చేయాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. షూటింగ్ కూడా ఆలస్యమైంది.

    తాజాగా గురువారం ‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ‘రాధేశ్యామ్’ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ మేరకు వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి బరిలో ఇప్పటికే పవన్ దిగగా.. ఇప్పుడు ప్రభాస్ కూడా సై అన్నాడు.

    కొద్దిగా ఆలస్యమైనా సరే.. సెలబ్రేషన్స్ పీక్స్ గా ఉంటాయని ఫ్యాన్స్ కు ఈ తీపికబరును అందించింది. వింటేజ్ ప్రేమ కథా చిత్రంగా దీన్ని రూపొందించారు. విక్రమాదిత్యగా ప్రభాస్ ఇందులో లవర్ బాయ్ గా కనిపించనున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.

    కాగా ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, బీట్స్ రాధేశ్యామ్ మూవీపై అంచనాలు పెంచేశాయి. తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రభాస్ తన ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. కరోనా పూర్తిగా తగ్గాక దీన్ని సంక్రాంతి బరిలో నిలిపేందుకు జనవరి 14కు సినిమాను అనౌన్స్ చేశారు.