Telugu News » Movies » Radhe shyam to release on the date rrr vacates
Radhe Shyam and RRR : ‘ఆర్ఆర్ఆర్’ వదిలే డేట్ కి రాధేశ్యామ్ వస్తాడట !
Radhe Shyam and RRR : నేషనల్ రేంజ్ లో గొప్ప విజువల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 18న, లేదంటే ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అంటూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇప్పుడు, రాధే శ్యామ్ మేకర్స్ కూడా తమ సినిమాను విడుదల చేయడానికి అటు ఇటుగా అదే తేదీలను చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. . ముఖ్యంగా మార్చి 18, […]
Radhe Shyam and RRR : నేషనల్ రేంజ్ లో గొప్ప విజువల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 18న, లేదంటే ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అంటూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇప్పుడు, రాధే శ్యామ్ మేకర్స్ కూడా తమ సినిమాను విడుదల చేయడానికి అటు ఇటుగా అదే తేదీలను చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. .
Tollywood Movies RRR, Radhe Shyam
ముఖ్యంగా మార్చి 18, ఏప్రిల్ 28 ఆర్ఆర్ఆర్ ప్రకటించిన ఈ రెండు తేదీలలో.. ఏదొక తేదీ నుంచి తప్పుకుంటుంది. కాగా ఆర్ఆర్ఆర్ వెనక్కి తగ్గే ఆ తేదీకి రాధే శ్యామ్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ‘దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడి, ఫుల్ కెపాసిటీతో థియేటర్లు అందుబాటులో ఉంటే.. ఈ భారీ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న సినిమాలు ఇవి.
Radhe Shyam Romantic Song
కానీ, కరోనా మూడో వేవ్ దెబ్బకు ఈ భారీ సినిమాలు వాయిదా పడ్డాయి. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘రాధేశ్యామ్’ కూడా పోస్ట్ఫోన్ అయింది. అయితే, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాల కొత్త విడుదల తేదీలపై పై విధంగా టాలీవుడ్‌లో రోజుకొక ప్రచారం జరుగుతుంది. నిజానికి ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ను మార్చి 18న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అంతలో ఆర్ఆర్ఆర్ మార్చి 18న, లేదంటే ఏప్రిల్ 28న మా సినిమా రిలీజ్ అంటూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.