Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఓ పీరియాడికల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా ప్రమోషన్లపై కాస్త దూకుడు పెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. మరోవైపు.. ఇటీవలే వచ్చిన ఈ రాతలే పాట మిలియన్ల వ్యూస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇదో జోష్‌తో మరో కొత్త అప్డేట్కు రెడీ అయ్యింది రాధేశ్యామ్ టీమ్.
Make way for the #LoveAnthem, the next song from #RadheShyam that will take your breath away. One heart, two heartbeats for the first time in the history of Indian cinema, bringing to you one movie with two different music experiences. pic.twitter.com/QciRVlMsvF
— UV Creations (@UV_Creations) November 28, 2021
వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ సాంగ్ రిలీజ్‌కు సంబంధించి న్యూ ట్వీట్‌తో ముందుకొచ్చారు. ఈ పాట విడుదలకు ముందు.. రేపు టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ టీజర్‌ను మొదట హిందీలో రేపు మధ్యాహ్నం 1గంటకు విడుదల చేయనుండగా.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ను రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణం రాజు సమర్పిస్తారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మాతలు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరు 14న ప్రేక్షకులను పలకరించనుంది ఈ సినిమా.
కాగా, ప్రస్తుతం ఆదిపురుష్‌లో ప్రభాస్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు సలార్ సినిమాతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Radhe shyam movie new update
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com