Radhe Shyam Box Office Collections: ‘రాధేశ్యామ్’ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ సినీ లోకాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ను అందించిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ‘రాధేశ్యామ్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లో అదరగొట్టింది. అలాగే సెకండ్ డే కూడా భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా 7000 స్క్రీన్ లలో విడుదల అయిన ‘రాధేశ్యామ్’ చాలా చోట్ల బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొదటి రోజు రూ.57 కోట్లకు పైగానే షేర్ ని రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. అదే విధంగా సెకండ్ డేన కూడా రూ.40 కోట్లకు పైగానే షేర్ ని రాబట్టింది.
Also Read: అక్కినేని ఫామిలీ సపోర్ట్ ఉన్న కూడా హీరో సుమంత్ స్టార్ గా ఎదగలేకపోవడానికి 5 కారణాలు ఇవే
ఏపీ & తెలంగాణలో ‘రాధేశ్యామ్’ సెకండ్ డే కలెక్షన్స్ :
నైజాం – 10.40 కోట్లు
సీడెడ్ – 8.46 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.35 కోట్లు
గుంటూరు – 3.70 కోట్లు
ఈస్ట్ గోదావరి – 3.43 కోట్లు
వెస్ట్ గోదావరి – 2.60 కోట్లు
కృష్ణ – 2.51 కోట్లు
నెల్లూరు – 4.56 కోట్లు

రెండో రోజు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం నిజంగా విశేషమే. బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ సినిమా కంటే కూడా ఈ చిత్రానికే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సిమిమా ‘రాధేశ్యామ్’ కావడం విశేషం. ప్రస్తుతం మరో రెండు వారాలు వరకూ ఏ భారీ సినిమా రిలీజ్ కి లేకపోవడం ఈ సినిమాకు ఇంకా బాగా కలిసి రానుంది.
ఏది ఏమైనా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి… ఆ అంచనాలను చాలా తేలికగా అందుకుంది. సినిమాపై ఉన్న హైప్ ను చాలా ఈజీగా అందుకుంది. పైగా భారీ హైప్, సోలో రిలీజ్, విపరీతంగా చేసిన ప్రమోషన్లు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.
Also Read: షాకింగ్: రాధేశ్యామ్ 2వ రోజు కలెక్షన్లు తెలిస్తే మతి పోవాల్సిందే?
[…] Samantha Comments On Pushpa Song: సమంత ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలే. వ్యక్తిగత ఇబ్బందులకు ఫుల్ స్టాప్ చెప్పి.. కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అయితే, ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఊ అంటావా పాటకు ఇంత భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. ఇది తెలుగు పాట అయినా కూడా పాన్ ఇండియా లెవల్‌లో హిట్టయింది. […]
[…] Highest Grossing Telugu Films In USA: తెలుగు సినిమాలకు యూఎస్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఓవర్సీస్ లో ఇతర భాషల సినిమాలను మించి మన టాలీవుడ్ మూవీలు వసూళ్లు రాబుతున్నాయి. కాగా ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కోటాలో మొదటి స్థానంలో నిలిచింది బాహుబలి-2. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్లు రాబట్టింది. […]
[…] Radhe Shyam Movie Bollywood Rating: ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా పై చాలా హైప్ వచ్చింది. అయితే, ఆ హైప్ ను అందుకోలేకపోయాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. కాగా కొంతమంది బాలీవుడ్ క్రిటిక్స్ పనిగట్టుకుని తెలుగు చిత్రాలకు నెగిటివ్ రేటింగ్స్ ఇస్తున్నారు అని, పుష్పను ఇలానే అణచివేయాలనుకుంటే బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది అని, రాధేశ్యామ్‌కు కూడా మరీ దారుణంగా 1.5, 2 రేటింగ్స్ ఇచ్చారని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు. […]