Raashii Khanna: జీవితం లో మనకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. కొంతమంది ఆ లక్ష్యాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లెక్క చేయరు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతారు. కానీ కొంతమంది మాత్రం పరిస్థితులకు అనుగుణంగా తమ లక్ష్యాలను మార్చుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కొంతమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ, సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే, మరికొంతమంది సినీ ఇండస్ట్రీ ని వదిలి సాఫ్ట్ వేర్ రంగంలోకి వెళ్లారు. అదే విధంగా సినీ ఇండస్ట్రీ ని వదిలి IAS, IPS ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ లో పాపులారిటీ, క్రేజ్ ని సంపాదించుకున్న ఒక హీరోయిన్, చిన్నప్పటి నుండి కలెక్టర్ అవ్వాలని కలలు కని, చివరికి సినీ రంగంలోకి అడుగుపెట్టి, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని నేడు పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది.
ఆమె మరెవరో కాదు, రాశీ ఖన్నా. చిన్నప్పటి నుండి ఈమె స్కూల్ లో, కాలేజీ లో టాపర్ గా కొనసాగింది. మంచి బ్రిలియంట్ స్టూడెంట్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి, జీవితాంతం సేఫ్ గా ఉండే ఉద్యోగం చేయలని అనుకుంది. అందుకే IAS చదవాలని కోరుకుంది. కొంతకాలం ట్రైనింగ్ తీసుకొని పరీక్షలు కూడా రాసిందట. కానీ విఫలం అవ్వడంతో సినీ రంగం వైపు అడుగులు వేసినట్టు తెలుస్తుంది. IAS పాస్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. మొదటి అట్టెంప్ట్ లోనే ఎవ్వరూ పాస్ అవ్వలేరు. ఎంత పెద్ద బ్రిలియంట్ స్టూడెంట్ అయినా అది అసాధ్యం. కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఎదో ఒక సమయంలో IAS పాస్ అవ్వొచ్చు. కానీ అన్నిసార్లు ప్రయత్నం చేయాలంటే కచ్చితంగా డబ్బు చాలా ఉండాలి. రాశీ ఖన్నా కి అంత స్తొమత అప్పట్లో లేకపోవడం తో IAS ప్రయత్నాలు ఆపి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. మొదటి సినిమాతోనే ఈమె కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ చిత్రం తర్వాత వరుసగా సినిమా అవకాశాలను సంపాదించి, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. సౌత్ లో మంచి క్రేజ్ వచ్చిన తర్వాత ఈమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఈమె నటించిన చివరి చిత్రం ‘సబర్మతి ఎక్స్ ప్రెస్’. థియేటర్స్ లో విడుదలై యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం జీ5 యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈమె పలు సినిమాలు చేయడానికి సంతకాలు చేసింది. వాటి వివరాలు బయటకి రావాల్సి ఉంది.