https://oktelugu.com/

Raashi Khanna : అందాల ‘రాశి’.. ఎరుపు రంగులో ఓరగా చూసి.. వైరల్ ఫొటోలు

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఆర్మీ కమాండర్ అరుణ్ కత్యాల్ పాత్రలో సిద్ధార్థ మల్హోత్ర ఈ సినిమాలో నటిస్తున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : March 3, 2024 / 09:36 PM IST
    Follow us on

    Raashi Khanna : రాశిఖన్నా.. ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటిదాకా తెలుగులో అభిమానులను అలరిస్తూనే ఉంది. తమిళం, హిందీ చిత్రాల్లోనూ మెరుస్తూనే ఉంది. కెరియర్ మొదట్లో మద్రాస్ కేఫ్, సుప్రీం, జై లవకుశ, జిల్, తొలిప్రేమ వంటి సినిమాల్లో నటించినప్పటికీ.. తర్వాత విడుదలైన సినిమాలు ఆమె కెరియర్ కు అంతగా హెల్ప్ కాలేదు. అయినప్పటికీ ఆమెకు అడపా దడపా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాల తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేయలేదు. సర్దార్, తిరు వంటి సినిమాల్లో కనిపించినప్పటికీ అవి తమిళంలో నిర్మితమై.. తెలుగులో డబ్ అయ్యాయి. రాశిఖన్నా ఇంతవరకు తెలుగు లో కొత్త ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేయలేదు. తమిళంలో మాత్రం ఒక సినిమా, హిందీలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వాస్తవానికి రాశికన్నా “మనం” సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో పూర్తిస్థాయి కథానాయకగా మారింది.

    కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీలో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది రాశి ఖన్నా. బ్యాక్ టు బ్యాక్ అనే వెబ్ సిరీస్ లో కొన్ని సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. సోషల్ మీడియాలోనూ తన అందమైన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ప్రస్తుతం రాశి ఖన్నా హిందీలో యోధ అనే ఓ సినిమా లో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ తో కలిసి ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించింది. అందులో భాగంగా ఎరుపు రంగు డ్రెస్ లో హొయలు పోయింది. ఆ చిత్రాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఐదు అడుగుల కు మించి ఎత్తు, ఎత్తుకు తగ్గట్టు అందం, ఆ అందానికి తగ్గట్టు అధునాతనమైన ఎరుపు రంగు డ్రెస్ వేయడంతో రాశి నిజంగానే అందాల రాశి లాగా కనిపిస్తోంది.

    సిద్ధార్థ మల్హోత్రా ప్రధాన పాత్రలో నిర్మించిన యోధ సినిమాలో రాశిఖన్నా కథానాయక పాత్ర పోషించింది. వాస్తవానికి మద్రాస్ కేఫ్ అనే హిందీ చిత్రం ద్వారా ఆమె సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమె హిందీ చిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇస్తోంది. మార్చి 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు దిశా పటాని కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఆర్మీ కమాండర్ అరుణ్ కత్యాల్ పాత్రలో సిద్ధార్థ మల్హోత్ర ఈ సినిమాలో నటిస్తున్నాడు.