
అందం, అభినయంతో పాటు ప్రతిభ కూడా ఉన్న కొద్ది మంది హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. ఉత్తారాది నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో పాగా వేసిన రాశీ తన తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే తోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో ఇప్పుడు డిమాండ్ ఉన్న నటిగా ఎదిగింది. ఆరంభంలో కొస్త బొద్దుగా ఉన్నా.. తర్వాత స్లిమ్‌గా మారిన ఆమె వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.
ఈ మధ్యే ప్రతిరోజూ పండగే, వెంకీమామ, వరల్డ్ ఫేమస్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తమిళ ఇంటస్ట్రీపై కూడా దృష్టి పెట్టిందామె. ఈ ఏడాదే ఏకంగా నాలుగు సినిమాలకు సంతకం చేసింది. ఈ ఢిల్లీ బ్యూటీ నటనే కాదు గాత్రం కూడా మధురంగా ఉంటుంది. ఇప్పటికే జోరు సినిమాలో టైటిల్ సాంగ్, బాలకృష్ణుడు చిత్రంలో తరైరా.. జవాన్‌లో బంగారూ.. ప్రతి రోజు పండగే మూవీలో యు ఆర్ మై హై పాటలు పాడి ఆకట్టుకుంది. పలు ఈవెంట్లలో స్టేజ్‌పై కూడా పాటలు పాడిన రాశీ ఖన్నా ఇప్పుడు మరో టాలెంట్‌ను బయట పెట్టింది.
సింగింగ్‌తో పాటు గిటార్ ప్లేయర్ చేయడంలో కూడా రాశిది అందెవేసిన చేయిలా ఉంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఇంటికి పరిమితమైన ఈ ఢిల్లీ బ్యూటీ… గిటార్ ప్లే చేస్తూ పాట పాడి అలరించింది. తన ఫేవరెట్ ‘గెట్ యు ద మూన్’ అనే ఇంగ్లిష్ సాంగ్‌ను చాలా అందంగా పాడి ఆకట్టుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటిదాకా రాశి నటన, గాత్రానికి ఫిదా అయిన వాళ్లు ఆమె కొత్త టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు. రాశీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.