https://oktelugu.com/

Rashi Khanna: వాళ్ళు నన్ను ఏదేదో అనేవాళ్లు – రాశీ ఖ‌న్నా

Rashi Khanna: బబ్లీ గర్ల్ ‘రాశీ ఖ‌న్నా’కి కాస్త తెలివి ఎక్కువ. ‘మనం’లో చిన్న సైడ్ క్యారెక్టర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా.. తన లౌక్యంతో తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రాశీ ఖన్నా ఓ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పోర్టల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు విశేషాలు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తనను చూసి విమర్శించిన విమర్శల పై ఆమె మాట్లాడింది. ‘సౌత్‌ లో నన్ను గ్యాస్‌ టాంకర్‌ అంటూ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 23, 2022 / 07:36 PM IST
    Follow us on

    Rashi Khanna: బబ్లీ గర్ల్ ‘రాశీ ఖ‌న్నా’కి కాస్త తెలివి ఎక్కువ. ‘మనం’లో చిన్న సైడ్ క్యారెక్టర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా.. తన లౌక్యంతో తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రాశీ ఖన్నా ఓ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పోర్టల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు విశేషాలు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తనను చూసి విమర్శించిన విమర్శల పై ఆమె మాట్లాడింది.

    Rashi Khanna

    ‘సౌత్‌ లో నన్ను గ్యాస్‌ టాంకర్‌ అంటూ రకరకాల పదాలతో వెక్కిరించేవారు. నేను కొద్దిగా లావుగా ఉండేదాన్ని. ఆ తర్వాత బరువు తగ్గాను. అయితే, నా మీద వ్యతిరేక కామెంట్లు చేసినా నేను పెద్దగా పట్టించుకోలేదు. అయినా.. నాకు పీసీఓడీ సమస్య ఉందన్న విషయం వాళ్లకు తెలియదు కదా. అది తెలియకుండా ఏదేదో అనేవాళ్లు. మొదట్లో బాధగా అనిపించినా.. ఇప్పుడు లైట్‌ తీసుకుంటున్నానని’ అంటూ చెప్పుకొచ్చింది రాశీ.

    Also Read: RRR Viral: ఆర్ఆర్ఆర్ థియేటర్ తెరల ముందు మేకులు, ఇనుప కంచెలు

    ఇక నటనలో పెద్దగా టాలెంట్ లేకపోవడంతో అవకాశాలు తగ్గాయి. తెలుగులో ఛాన్స్ లు లేవు అని గ్రహించిన వెంటనే తమిళంకి మకాం మార్చింది. ఇప్పుడు తమిళంలో వరుస అవకాశాలతో ఫుల్ డిమాండ్ తెచ్చుకుంది. కెరీర్ పడిపోయింది అనుకున్న ప్రతిసారి ‘రాశీ ఖ‌న్నా’ మళ్ళీ నిలబడగలుగుతుంది. కోలీవుడ్‌ లో ఇప్పటికే రాశీఖన్నా ‘అరణ్‌మణై 3’, విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’ వంటి సినిమాలు చేస్తోంది.అలాగే కార్తీ ‘సర్దార్‌’ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తోంది.

    అయితే ఈ బోల్డ్ బ్యూటీకి మరో బంఫర్ ఆఫర్ తగిలింది. ధనుష్‌ హీరోగా మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్‌ గా రాశీఖన్నాని తీసుకుంటున్నారు. ధనుష్‌ చేస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాలో కూడా రాశీఖన్నా ఛాన్స్ కొట్టేసింది అంటే.. హీరోయిన్ గా రాశీఖన్నా స్థాయి పెరిగినట్టే.

    Rashi Khanna

    మొత్తానికి పెద్దగా టాలెంట్ లేకపోయినా హిట్లు లేకపోయినా చూస్తుండ‌గానే తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించేసుకుంది. అయితే ఇలా సడెన్ గా ఛాన్స్ లు పోటెత్తడానికి గల కారణం.. రెమ్యునిరేషన్ ను భారీగా తగ్గించడమేనట. పైగా ఎక్స్ పోజింగ్ విషయంలో పరిథి దాటాలనే కండిషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

    Also Read: India Russia Relations: రష్యాను నమ్ముకుని ఒంటరి కానున్న భారత్?

    Recommended Video:

    Tags