R. Narayana Murthy: విప్లవ చిత్రాల కథానాయకుడు ఆర్. నారాయణమూర్తి. తానే సొంతంగా స్నేహచిత్ర పిక్చర్స్ స్థాపించి తానే దర్శకుడు, నటుడుగా పలు చిత్రాలు నిర్మించి ప్రేక్షకులను మెప్పించారు. విప్లవ చిత్రాలకు మారుపేరుగా నిలిచారు. ఆర్. నారాయణ మూర్తి అంటే విప్లవ చిత్రాలే అని గుర్తుకు వస్తాయి. అలా అర్థరాత్రి స్వాతంత్ర్యం, ఎర్రసైన్యం, అడవిదివిటీలు, చీకటి సూర్యులు, ఒరే్య్ రిక్షా వంటి సినిమాలు తీసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆర్. నారాయణ మూర్తి గతంలో నటుడిగా కూడా అందరికి సుపరిచితమే. తన చిత్రాల ద్వారా విప్లవాన్ని గురించి ప్రచారం చేశారు. మావోయిస్టుల సినిమాలకు పెట్టింది పేరు.

పీపుల్స్ స్టార్ గా ఆర్.నారాయణ మూర్తి తన చిత్రాలను నిర్మించారు. స్ర్కీన్ రైటర్, గాయకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడిగా బహుముఖ పాత్రలు పోషించాడు. తన చిత్రాలకు తానే కథలు రాసుకుని ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. విప్లవ సినమాల రూపకర్తగా ఖ్యాతి పొందాడు. తన సినిమాల్లో ఎక్కువగా విప్లవ భావాలను చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేశారు. అందుకు పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు.
Also Read: Gopichand Malineni- Balakrishna: గోపీచంద్’కి బాలయ్య సీరియస్ వార్నింగ్.. కారణం అదే
ఆర్. నారాయణ మూర్తి మాతృమూర్తి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూశారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టెమ్మ వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు కావడంతో వయోభారంతోనే ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. విప్లవ సినిమాలు నిర్మించడంలో ఆయనది అందెవేసిన చేయి. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేవారు.

తాను విప్లవ చిత్రాలు తీస్తుండటంతో వివాహం చేసుకుంటే తన జీవితభాగస్వామి ఎక్కడ తన లక్ష్యానికి అడ్డు వస్తుందోననే ఉద్దేశంతో పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయినట్లు చెబుతుంటారు. తన లక్ష్యానికి అడ్డు చెప్పే అవకాశం ఉన్నందునే పెళ్లి అనే మాట ఎత్తకుండా ఇన్నాళ్లు ఒంటరిగానే ఉండిపోయారట. అంటే విప్లవ సినిమాలంటే ఆయనకు ఎంత ఇష్టమో తెలుస్తోంది. తన చిత్రాల ద్వారా సమాజాన్ని మేల్కొల్పడమే ఆయన ఆశయం. తన ఆశయ సాధనలో ఎంతటి త్యాగానికి అయినా వెనకాడకుండా ఉండటమే గొప్ప విషయం.
[…] […]
[…] […]