Puspha Tamil TRP: గత ఏడాది చివర్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మన తెలుగులో కంటే ఇతర బాషలలో ఈ సినిమాని ఆడియన్స్ నెత్తిన పెట్టుకున్నారు అనే చెప్పాలి..ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పటికి పుష్ప మేనియా నుండి పూర్తిగా కోలుకోలేదు..కేవలం 3 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లతో ప్రారంభం అయినా ఈ సినిమా హిందీ వెర్షన్ బాక్స్ ఆఫీస్ ప్రస్థానం 110 కోట రూపాయిల వసూళ్లు సాదించేంత వరుకు వెళ్ళింది..హిందీ లో టీవీ లో ప్రారం అయ్యినప్పుడు కూడా ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకంటే అత్యధిక TRP రేటింగ్స్ సాధించిన సినిమా గా సరికొత్త చరిత్ర సృష్టించింది..తెలుగులో కూడా అంతే..మొదటిసారి స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయినా ఈ సినిమాకి 23 TRP రేటింగ్స్ వచ్చాయి.

అన్ని బాషలలో TRP రేటింగ్స్ అదరగొట్టేసిన ఈ సినిమా తమిళ్ లో కూడా అద్భుతమైన TRP రేటింగ్స్ ని సొంతం చేసుకుంది..ఇటీవలే టెలికాస్ట్ అయినా ఈ మూవీ దాదాపుగా అక్కడ 10 .95 తృపి రేటింగ్స్ ని సొంతం చేసుకున్నట్టు BAARC సంస్థ పేరుకుంది..ఇక్కడ అత్యధిక TRP రేటింగ్స్ ని సొంతం చేసుకున్న దబ్ సినిమాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహ రెడ్డి చిత్రం నిలిచింది..ఆ సినిమా తర్వాత అత్యధిక TRP రేటింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమా నిలవగా..మూడవ స్థానం లో పుష్ప నిలిచింది..అలా బాక్స్ ఆఫీస్ పరంగాను మరియు TRP రేటింగ్స్ పరంగాను ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు అనే చెప్పాలి..ఇప్పటికి సోషల్ ఇండియా లో ఈ సినిమా సాంగ్స్ కి డాన్స్ వేస్తూ రీల్స్ చేసే వాళ్ళు ఉన్నారు..ఇప్పట్లో ఈ సినిమా మేనియా ఆగే సమస్యే లేదు ట్రేడ్ పండితుల అంచనా..చూడాలి మరి.
ఇక అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 లో నటించడానికి సర్వం సిద్ధం అయ్యాడు..సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ లో మరికొన్ని మార్పులు చేర్పులు చేసి పార్ట్ 1 కంటే గొప్పగా ఉండేలా తయారు చేసాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ..మరో రెండు నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి పార్ట్ 1 విడుదల అయినా తేదీ డిసెంబర్ 17 వ తారీఖునే పార్ట్ 2 కూడా విడుదల చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది..KGF కి సీక్వెల్ గా వచ్చిన KGF చాప్టర్ 2 సినిమా అన్ని బాషలలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ని ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..కేవలం 43 కోట్ల రూపాయిలు నెట్ వసూలు చేసిన సినిమా కి సీక్వెల్ గా చేస్తేనే ఈ స్థాయిలో వసూలు చేసింది అంటే..ఫుల్ రన్ లో 110 కోట్ల రూపాయివుల నెట్ ని వసూలు చేసిన పుష్ప సినిమా సీక్వెల్ ఎంత వసూలు చెయ్యాలి అనేది ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతున్న చర్చ..పరిస్థితులు అన్ని కలిసి వస్తే ఈ సినిమా వెయ్యి కోట్లు కూడా వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ..చూడాలి మరి పుష్ప 2 కూడా పార్ట్ 1 సంచలనం సృష్టిస్తుందో లేదో.