https://oktelugu.com/

Pushpa The Rule: ‘పుష్ప:ద రూల్’​ షూటింగ్​కు ముహూర్థం ఖరారు

Pushpa The Rule:స్టైలిస్ట్ స్టార్​ అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా పుష్ప. సుకుమార్​ దర్శకత్వంలో హెవీ బడ్జెట్​తో తెరకెక్కిిన ఈ సినిమా డిసెంబరు 17న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన తొలిరోజే మాస్​ కలెక్షన్లతో ప్రభంజనం సృష్టించింది. సుమారు 34 కోట్లకుపైగా తొలి రోజు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు తమిళ్​, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా, ఈ సినిమా విజయవంతం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 08:12 PM IST
    Follow us on

    Pushpa The Rule:స్టైలిస్ట్ స్టార్​ అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా పుష్ప. సుకుమార్​ దర్శకత్వంలో హెవీ బడ్జెట్​తో తెరకెక్కిిన ఈ సినిమా డిసెంబరు 17న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన తొలిరోజే మాస్​ కలెక్షన్లతో ప్రభంజనం సృష్టించింది. సుమారు 34 కోట్లకుపైగా తొలి రోజు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు తమిళ్​, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా, ఈ సినిమా విజయవంతం కావడంతో నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    కాగా, ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని పుష్ప ది రైజ్​ టైటిల్​తో విడుదల చేయగా.. రెండో భాగాన్ని పుష్ప ద రూల్​ పేరుతో తీసుకురానున్నారు. తాజా సమాచారం ప్రకారం రెండో పార్ట్​ను ఫిబ్రవరి నుంచి షూటింగ్​ మొదలుపెట్టనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అయితే, ఫస్ట్​ పార్ట్​ విడుదల విషయంలో హడావిడి జరగడం వల్ల.. టెక్నికల్​ లోపాలు వచ్చిన మాట నిజమేనని నిర్మాతలు అంటున్నారు. కానీ, సెంకడ్​ పార్ట్ విషయంలో ప్రేక్షకులను నిరాశపరిచేది లేదని.. అన్ని జాగ్రత్తలు తీసుకుని.. రెండు నెలలు ముందుగానే సిద్దం చేసి మరీ పుష్ప ఫెస్టివల్​నుక్రియేట్​ చేస్తామని హామీ ఇచ్చారు.

    కాగా, పుష్ప తొలి భాగం హిందీ వర్షన్​ విషయంలో కూడా మొదట్లో ఇబ్బంది ఎదురైంది. అన్నీ అనుకున్నట్లు జరిగింటే.. బాలీవుడ్​లో తొలిరోజు వసూల్లు చేసిన దానికంటే రెట్టింపు వసూళ్లు  వచ్చిండేవని నిర్మాతలు చెబుతున్నారు. మరి ఏ మేరకు సెకండ్​పార్ట్​ను రసవత్తరంగా తెరకెక్కిస్తారో చూడాలి మరి.