Pushpa Telugu Movie Review: ‘పుష్ప- ది రైజ్’ రివ్యూ

Pushpa Telugu Movie Review: నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, సునీల్, అనసూయ, ధనుంజయ, ఫహాద్ ఫాజిల్ తదితరులు. రచ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : సుకుమార్ ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్ మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్ ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్ ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవుతూ నేషనల్ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకోవడం కోసం ‘అల్లు అర్జున్’ చేసిన ప్రయత్నం పుష్ప- ది రైజ్’. […]

Written By: Shiva, Updated On : December 17, 2021 1:23 pm
Follow us on

Pushpa Telugu Movie Review:
నటీనటులు :
అల్లు అర్జున్, రష్మిక మందన్న, సునీల్, అనసూయ, ధనుంజయ, ఫహాద్ ఫాజిల్ తదితరులు.
రచ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : సుకుమార్
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై
కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్

Pushpa Movie Review

‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవుతూ నేషనల్ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకోవడం కోసం ‘అల్లు అర్జున్’ చేసిన ప్రయత్నం పుష్ప- ది రైజ్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా నేడు భారీ స్థాయిలో రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ :
అక్రమ సంబంధానికి పుట్టాడని పుష్ప రాజ్ (అల్లు అర్జున్) చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇంటి పేరు కూడా లేకుండా సమాజంలో ఎన్నో బాధలు పడాల్సి వస్తోంది. అవన్నీ చూసి చూసి విసిగిపోయిన పుష్పరాజ్ ఒక కసితో పెరుగుతాడు. ఆ కసితోనే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ముఠాలో కూలీవాడిగా జీవితాన్ని ప్రారంభిస్తాడు. అతని కసి, ఆవేశం ఆ ముఠా నాయకుడు కొండారెడ్డి (అజయ్ ఘోష్)కి పార్టనర్ ను చేస్తోంది. ఈ మధ్యలో శ్రీవల్లీని (రష్మిక మందన్న) చూసి ప్రేమలో పడతాడు. పుష్పరాజ్ చివరకు ఆమె ప్రేమను గెలుచుకుంటాడు.

ఇక ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పుష్పరాజ్ ఏకంగా ఎర్రచందనం సిండికేట్ హెడ్ మంగళం శ్రీను (సునీల్)తో గొడవ పడి, అతన్ని ఎదిరించి తానే సిండికేట్ హెడ్ గా రూపాంతరం చెందుతాడు. చివరకు ఎర్రచందనం సిండికేట్ కి కింగ్ లా ఉన్న పుష్పరాజ్ ను ఎవరు టార్గెట్ చేశారు ? భన్వర్ సింగ్ షెఖావత్ (ఫహాద్ ఫాజిల్)తో పుష్ప రాజ్ కి మధ్య జరిగిన గొడవ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :
పుష్ప అనగానే ఇదేదో హీరోయిన్ పేరు చుట్టూ సినిమా నడుస్తోందనుకున్నారు మొదట్లో. కానీ, ‘తగ్గేదే లే’ అంటూ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో వచ్చి మొత్తానికి బన్నీ ఆకట్టుకున్నాడు. సినిమాలోని గ్రాండ్ విజువల్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఇక కథలోని మెయిన్ ఎమోషన్స్.. ముఖ్యంగా బన్నీ పాత్రలోని షేడ్స్ చాలా బాగున్నాయి. అలాగే రష్మిక మండన్నాతో సాగే లవ్ ట్రాక్ కూడా కొత్తగా ఉంది.

ఎర్రచందనం నేపథ్యంలో వచ్చే మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ ను సుకుమార్ చాలా బాగా తీర్చిదిద్దాడు. అలాగే హీరో పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలను కూడా చాలా బాగా డిజైన్ చేశాడు. కాకపోతే సినిమాలో కథనం విషయంలో సుకుమార్ చాలా వీక్ గా కనిపించాడు. కీలక సీన్స్ లో కూడా చాలా స్లో ప్లేతో ఆ సీన్స్ తెరకెక్కించడంతో అవి బోర్ కొట్టాయి.

దీనికి తోడు కొన్ని సీన్స్ మెలోడ్రామాలా అనిపిస్తాయి. పాత్రలు కూడా బాగా ఎక్కువ అవ్వడం.. చాలా పాత్రలకు మనం కనెక్ట్ కాము. ఇక కామెడీ కోసం పెట్టిన సీన్స్ కూడా బాగాలేదు. పోలీసులు – హీరో మధ్య నడిచే డ్రామా కూడా పూర్తి సినిమాటిక్ గా ఉంది. సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్ట్ పెంచేలా ముగింపును ఇవ్వలేకపోయారు.

ప్లస్ పాయింట్స్ :
బన్నీ నటన,
నేపథ్యం, యాక్షన్ సీన్స్,
కొన్ని ఎమోషనల్ సీన్స్
సాంకేతిక వర్గం పనితీరు

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ నెమ్మదించిన కథాగమనం
ఇంట్రెస్ట్ లేని కొన్ని సీన్స్,
సెకండ్ హాఫ్.

Also Read: Pushpa Movie: యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో రికార్డు … 2021 లో అల్లు అర్జున్ టాప్

సినిమా చూడాలా ? వద్దా ?
‘తగ్గేదే లే’ అంటూ బన్నీ తన క్యారెక్టరైజేషన్ తో ఆకట్టుకున్నా.. సుకుమార్ మాత్రం స్లో నేరేషన్, బోరింగ్ సీన్స్ తో నిరాశ పరిచాడు. ,అయితే, బన్నీ ఫ్యాన్స్ ను మాత్రం ఈ సినిమా బాగా మెప్పిస్తుంది. అలాగే సీరియస్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వారు కూడా ఈ సినిమాని చూడొచ్చు.

రేటింగ్ : 2.75

Also Read: Pushpa Movie: “పుష్ప” మూవీ కారణంగా హిందూపురంలో ఉద్రిక్తత… కారణం అదేనా