Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా పుష్ప. ఈ సినిమా 2021లో రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. చిత్తూరు యాసలో వచ్చిన ఈ సినిమాతో ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు. అయితే మొదటి భాగం పుష్ప ది రైజ్ సూపర్ సక్సెస్ ను అందుకోగా పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. రెండో పార్ట్ గురించి అప్డేట్ లు వచ్చినప్పుడల్లా మరింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు బన్నీ అభిమానులు.
మొదటి పార్టులో పుష్ప ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్.. రెండో పార్టులో తన సామ్రాజాన్ని ఎలా విస్తరించాడు అనేది చూపించబోతున్నారట. అంతేకాదు ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా ఉండబోతుందట. అందులో పుష్ప తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటారు? దాని కోసం ఎలా యుద్ధం చేస్తారు అనే స్టోరీతో సినిమాను ముగిస్తారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.
సెకండ్ పార్ట్ ను ఆగస్టు 15కి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన రెండు పేర్లు తెలిసిందే. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ అయితే మూడవ పార్ట్ కు పుష్ప రోర్ అని ఖరారు చేశారని కూడా టాక్. మరి ఈ వార్తలపై ఇప్పటికీ చిత్ర యూనిట్ స్పందించలేదు. కాబట్టి వీటి గురించి తెలియాలంటే వేచి ఉండాల్సిందే.
అయితే ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారట. ఇక సునీల్, అనసూయ, ధనంజయ నెగిటివ్ పాత్రల్లో నటిస్తున్నారు. రష్మిక మందన ఈ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మొదటి పార్ట్ కు దేవీ శ్రీ ఇచ్చిన సాంగ్స్ వరల్డ్ వైడ్ గా హిట్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఐటం సాంగ్స్ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. మరి దేవీ శ్రీ ఏ రేంజ్ సాంగ్ రెడీ చేస్తున్నారో చూడాలి.