Pushpa: పుష్ప మేకింగ్ వీడియో చూశారా.. బన్నీ స్పీచ్ ​మాత్రం అదుర్స్​

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ‘పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా రెండు బాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో […]

Written By: Raghava Rao Gara, Updated On : December 5, 2021 1:04 pm
Follow us on

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ‘పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా రెండు బాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది.

ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ, సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా ఈ నెల 6న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ట్రైలర్ విడుదలకు ఓ రోజు ముందు.. ఫ్యాన్స్​కు మేకింగ్​ వీడియో రూపంలో సర్​ప్రైజ్​ ఇచ్చింది పుష్ప టీమ్​. మారేడుపల్లి అడవుల్లో షూటింగ్​కు సంబంధించిన మేకింగ్​ వీడియోను చిత్రయూనిట్​ షేర్​ చేసింది. ఈ వీడియోలో సినిమాలో పనిచేసిన వాళ్లను ఉద్దేశిస్తూ బన్నీ ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘చిత్రీకరణలో భాగంగా అడవిలోకి ఎలా వచ్చామో.. అలాగే తిరిగి వెళ్లాలని’ చెప్పారు బన్నీ. తాగి పడేసే ప్లాస్టిక్ కప్స్‌, బాటిళ్లను డస్ట్ బిన్‌లో వేయాలని తెలిపారు. ఈ క్రమంలోనే  సినిమా మేకింగ్​కు సంబంధించిన కొన్ని క్లిప్​లను వీడియోలో చూపించారు. భారీ అంచనాల మధ్య వస్తోన్న ఈ సినినా ఎలా సక్సెస్​ అవుతుందో తెలియాల్సి ఉంది.