https://oktelugu.com/

Allu Arjun Pushpa: ‘పుష్ప’లో బన్నీకి తల్లిగా నటించిన ఆమె ఎంత స్టైలిష్ గా ఉందో చూశారా?

Allu Arjun Pushpa: ఇటీవలే స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో ఘనంగా విడుదలైన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో అల్లు అర్జున్ నటన గురించి ఆయన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదిలా ఉంటే ఇందులో అల్లు అర్జున్ అమ్మగా నటించిన కల్పలత గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు పరిచయమే. కేవలం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 23, 2021 / 10:44 AM IST
    Follow us on

    Allu Arjun Pushpa: ఇటీవలే స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో ఘనంగా విడుదలైన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో అల్లు అర్జున్ నటన గురించి ఆయన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.

    Allu Arjun Mother In Pushpa

    ఇదిలా ఉంటే ఇందులో అల్లు అర్జున్ అమ్మగా నటించిన కల్పలత గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు పరిచయమే. కేవలం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాస్త పరిచయం పెంచుకుంది. కానీ పుష్ప సినిమాలో బన్నీకి అమ్మగా నటించడంతో ప్రస్తుతం ఆమె సొంతంగా ఒక గుర్తింపును సాధించుకొని ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది.

    Also Read: పుష్ప కలెక్షన్లు: అసలు వాస్తవాలు ఇవేనా?

    ఇంతకుముందు ఆమె పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. కానీ గుర్తింపు వచ్చిన పాత్ర మాత్రం ఈ పాత్ర అని ఇటీవలే తెలిపింది. తనకు సుకుమార్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషమని పైగా అల్లు అర్జున్ కు అమ్మ పాత్రలో నటించడం తన అదృష్టమని తెలిపింది.

    ఈ ఆనందానికి అవధులు లేవు అంటూ.. ఈ పాత్రతో కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లుగా ఉందని.. తనకు కొడుకులు లేని లోటు ఈ సినిమాతో తీరిపోయిందని తెలిపింది. ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. కాగా తనకు సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో తనని చూసి ఎంత స్టైలిష్ గా ఉందో అంటూ బాగా లైక్ చేస్తున్నారు నెటిజన్లు.

    Also Read: అల్లు అర్జున్ రీల్ హీరో కాదు, రియల్ హీరో !