https://oktelugu.com/

Pushpa: పుష్ప ‘ఏయ్​ బిడ్డా’ పాట ప్రోమో రిలీజ్​ ఈరోజే!

Pushpa: ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. పాన్​ ఇండియా స్థాయిలో వస్తోన్న ఈ సినిమా నుంచి రోజుకో అప్​డేట్​తో హైప్​ పెంచుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్​లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకన్నాయి. కాగా, ఈ సినిమా నుంచి వచ్చిన  దాక్కో దాక్కో మేక, శ్రీ వల్లి, సామి సామి సాంగ్స్​ నెట్టింట్లో వైరల్​గా మారాయి. మిలియన్ల వ్యూస్​తో దుసుకెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలోనే మరో పాటను విడుదల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 16, 2021 12:47 pm
    Follow us on

    Pushpa: ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. పాన్​ ఇండియా స్థాయిలో వస్తోన్న ఈ సినిమా నుంచి రోజుకో అప్​డేట్​తో హైప్​ పెంచుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్​లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకన్నాయి. కాగా, ఈ సినిమా నుంచి వచ్చిన  దాక్కో దాక్కో మేక, శ్రీ వల్లి, సామి సామి సాంగ్స్​ నెట్టింట్లో వైరల్​గా మారాయి. మిలియన్ల వ్యూస్​తో దుసుకెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలోనే మరో పాటను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఏయ్​ బిడ్డా ఇది నా అడ్డా పేరుతో రానున్న పాటతో రానుంది. ఈ పాట ప్రోమోకు మేకర్స్ టైమ్​ ఫిక్స్​ చేశారు.

    pushpa

    ఈ రోజు సాయంత్రం 4 గంటల5 నిమిషాలకు ప్రోమోను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు. ఈ పాటపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్​కి ఈ పాట ఫేవరట్​ అని కూడా తెలిపారు. పూర్తి డిఫరెంట్ లుక్​లో కనిపిస్తోన్న అల్లు అర్జున్​.. ఈ పాటకు ఎలా స్టెప్పులేస్తాడో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్​ కూడా అంతే మాస్​ బీట్స్​ అందించినట్లు తెలుస్తోంది.

    https://twitter.com/PushpaMovie/status/1460453615559065602?s=20

    ప్రస్తుతం సినిమా షూటింగ్​ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు సుకుమార్​. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్​ ఈ సినిమాను నిర్మిస్తోంది.  జగపతి బాబు, సునీల్, అనసూయ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్​లో ఎప్పుడూ కనిపించని విభిన్నమైన పాత్రలో బన్నీ ఈ మూవీలో కనిపించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా కనిపించనుంది.