Pushpa : ‘పుష్ప’ను 28 కోట్లకు కొన్నారు.. మైత్రికి అన్నీ లాభాలే !
Pushpa Digital Rights : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప– ది రైజ్’ సినిమా మూడు వారాల్లోనే ₹290 కోట్లకుపైగానే కలెక్ట్ చేసింది. అయితే, నిన్నటి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయింది. ఈ నేపథ్యంలో పుష్ప పై ఓ రూమర్ తెగ వినిపిస్తోంది. అసలు పుష్ప ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ ఎంతకు కొనుగోలు చేసింది అనేదే ఆ రూమర్ సారాంశం. ఇండస్ట్రీ ఇన్ […]
Pushpa Digital Rights : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప– ది రైజ్’ సినిమా మూడు వారాల్లోనే ₹290 కోట్లకుపైగానే కలెక్ట్ చేసింది. అయితే, నిన్నటి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయింది. ఈ నేపథ్యంలో పుష్ప పై ఓ రూమర్ తెగ వినిపిస్తోంది. అసలు పుష్ప ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ ఎంతకు కొనుగోలు చేసింది అనేదే ఆ రూమర్ సారాంశం. ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. దాదాపుగా ₹28 – 30 కోట్లకు పుష్ప డిజిటల్ రైట్స్ హక్కులను అమెజాన్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
Pushpa
ఎలాగూ థియేటర్ కలెక్షన్స్ తో పుష్ప మొత్తానికి బ్రేక్ ఈవెన్ అయింది. దాంతో రైట్స్ ద్వారా వచ్చే డబ్బులన్నీ లాభాలే. నిజానికి మొదటి రోజు నుంచీ ‘పుష్ప’ కలెక్షన్స్ పై చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ సినిమాకు నిజంగానే కలెక్షన్లు వస్తున్నాయా ? రావడం లేదా ? అనే అనుమానం. కానీ పుష్పరాజ్ కిందామీదా పడుతూ మొత్తానికి హిట్ కొట్టాడు.
మైత్రి మూవీ మేకర్స్ కి లాభాలను అందించాడు. ఏది అయితే ఏం మొత్తమ్మీద పుష్ప విజయాల తీరం చేరింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రష్ రష్మికా మందన్నా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమాను బాగా తెరకెక్కించాడు. పాన్ ఇండియన్ లెవెల్లోనే భారీ స్థాయిలో భారీ హిట్ సాధించింది.