Pushpa
Pushpa : ఒకప్పుడు స్కూల్ పిల్లల్లో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఇప్పుడు మనం ఏ హీరో అభిమాని అయిన అయ్యుండొచ్చు, కానీ మన చిన్నతనం లో చిరంజీవి ని అభిమానించే ఉంటాము. అలాంటి క్రేజ్ నేటి తరం హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) కి ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రేస్ గుర్రం, సరైనోడు, అలా వైకుంఠపురం లో, పుష్ప సిరీస్ వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన పుష్ప 2(Pushpa 2 Movie) తర్వాత చిన్న పిల్లల్లో అల్లు అర్జున్ క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరిపోయింది. 100 మందిలో 90 మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటున్నారు. స్కూల్ నుండి ఇంటర్ పిల్లల వరకు అల్లు అర్జున్ క్రేజ్ అలా ఎగబాకింది.
అయితే రీసెంట్ గా యూసఫ్ గూడ లో ఉన్న ఒక స్కూల్ లో స్టూడెంట్స్ అందరూ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ స్టైలింగ్ ని అనుసరిస్తూ పెద్ద తలనొప్పిగా మారారని, అసలు ఇలాంటి సినిమాలను సెన్సార్ బోర్డు వారు ఎలా అంగీకరిస్తున్నారని, ప్రభుత్వాలు ఎలా విడుదల చేయడానికి ఒప్పుకుంటున్నారని స్కూల్ హెడ్ మాస్టర్ రీసెంట్ గా జరిగిన ఒక డిబేట్ లో చెప్పుకొచ్చారు. మా స్కూల్ లో సగానికి పైగా స్టూడెంట్స్ మాట్లాడే తీరు మారిపోయింది, వాళ్ళ ప్రవర్తనలో చాలా తేడా వచ్చేసింది, యాంటీ హీరోలను రోల్ మోడల్ గా తీసుకుంటే పిల్లలు చెడిపోతారని, తక్షణమే ఇలాంటి సినిమాలను సెన్సార్ బోర్డు భవిష్యత్తులో బ్యాన్ చేయకపోతే పిల్లలు బాగా చెడిపోతారని హెడ్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు తమ హీరో ఏ రేంజ్ లో నటించకపోతే ఆ పిల్లలు అంతలా కనెక్ట్ అవుతారు?, స్కూల్ పిల్లల్లో అల్లు అర్జున్ కి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ఎవరికీ లేదంటూ చెప్పుకొచ్చారు.
మరికొంతమంది అయితే అల్లు అర్జున్ ని ట్యాగ్ చేసి రోల్ మోడల్ గా నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు, ఇలాంటి అసాంఘిక సినిమాలు తీసి చెడగొట్టేస్తున్నావు, భవిష్యత్తులో అయినా ఇలాంటి సినిమాలు చేయడం ఆపేయ్ అంటూ నిలదీస్తున్నారు. ఏది ఏమైనా ‘పుష్ప’ అనే క్యారక్టర్ ఒక సంచలనం, దేశం లో అత్యధిక శాతం మంది జనాలు ఈ సినిమాలోని మ్యానరిజమ్స్ ని యాటిట్యూడ్ ని అనుసరిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి సెన్సేషనల్ క్యారక్టర్ వేరే హీరోకి తక్కువ సమయంలో పడడం అసాధ్యమే. 2010 నుండి 2020 వరకు ‘గబ్బర్ సింగ్’ , ‘బాహుబలి’ క్యారక్టర్స్ ఎలా అయితే జనాల్లో ఆశేష ఆదరణ దక్కించుకున్నాయి, 2020 వ దశాబ్దం లో ‘పుష్ప’ క్యారక్టర్ వాటికి మించిన ఆదరణ దక్కించుకున్నాయి.