https://oktelugu.com/

Pushpa Collections: బాక్సాఫీస్ : ‘పుష్ప’ 6 రోజుల కలెక్షన్స్ !

Pushpa Collections: ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించే కోణంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో సినిమాకు మిశ్రమ ఫలితాలు వస్తాయనుకున్నారు. కానీ, ఇప్పటివరకు అయితే.. కలెక్షన్స్ విషయంలో ‘పుష్ప’ ఏ మాత్రం తగ్గడం లేదు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. పైగా భారీ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 23, 2021 / 04:20 PM IST
    Follow us on

    Pushpa Collections: ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించే కోణంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో సినిమాకు మిశ్రమ ఫలితాలు వస్తాయనుకున్నారు. కానీ, ఇప్పటివరకు అయితే.. కలెక్షన్స్ విషయంలో ‘పుష్ప’ ఏ మాత్రం తగ్గడం లేదు.

    Pushpa Collections

    అల్లు అర్జున్ కెరీర్ లోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. పైగా భారీ అంచనాలతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం ఆరు రోజుల్లోనే రికార్డుల మోత మోగిస్తోంది. వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసి పారేస్తోంది.

    మరి 6 రోజుల కలెక్షన్ల వివరాలను ఏరియాల వారిగా చూస్తే..

    నైజాం 29.45 కోట్లు
    సీడెడ్ 10.68 కోట్లు
    ఉత్తరాంధ్ర 5.75 కోట్లు
    ఈస్ట్ 3.87 కోట్లు
    వెస్ట్ 3.20 కోట్లు
    గుంటూరు 4.13 కోట్లు
    కృష్ణా 3.38 కోట్లు
    నెల్లూరు 2.47 కోట్లు

    ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 62.92 కోట్లు

    తమిళ్ నాడు 7.08 కోట్లు
    కేరళ 2.90 కోట్లు
    కర్ణాటక 8.90 కోట్లు
    రెస్ట్ 10.90 కోట్లు
    ఓవర్సీస్ 9.40 కోట్లు

    Also Read: 2021 మ్యూజికల్ రివ్యూ : టాలీవుడ్ మ్యూజికల్ హిట్స్

    ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 102.10 కోట్లు ఈ చిత్రం రాబట్టింది.

    అయితే, ఈ సినిమా అన్ని బాషల వెర్షన్ లను కలుపుకుని మొత్తం రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. బారి రేట్లకు బయ్యర్లకు అమ్మారు. కాబట్టి.. బయ్యర్లు బాక్సాఫీస్ సేఫ్ అవ్వాలి అంటే.. మొత్తం ఈ సినిమా రూ.146 కోట్లు కలెక్ట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు రూ.97.70 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో రూ.46.3 కోట్లు రాబట్టాలి.

    Also Read: Actor Nani: హీరో నాని సంచలన నిర్ణయం… ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    Tags