Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం వేడి బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా తగ్గలేదు. నిన్న కూడా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. దీనిని బట్టి ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చిత్రం క్లైమాక్స్ లో పార్ట్ 3 కచ్చితంగా ఉంటుందని, ఒక్క చిన్న లీడ్ సన్నివేశాన్ని వదులుతాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప తన అన్నయ్య కుటుంబంతో శుభమా అని కలిసి, సంతోషంగా తన కూతురి పెళ్లి లో పాల్గొన్న సమయంలో బాంబు బ్లాస్ట్ చేస్తాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కేవలం ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాక్ సైడ్ షాట్ ని చూపిస్తాడు డైరెక్టర్ సుకుమార్. ఇంతకీ బాంబు బ్లాస్ట్ చేసిన ఆ వ్యక్తి ఎవరు?.
పుష్ప కి ప్రధాన శత్రువైన షికావత్ అయితే కచ్చితంగా కాదు. ఎందుకంటే అతని నెత్తి మీద జుట్టు ఉంది. సోషల్ మీడియా లో వినిపిస్తున్న కథనాల ప్రకారం చూస్తే, ఆ బాంబు బ్లాస్ట్ చేసిన ఆర్టిస్ట్ విజయ్ దేవరకొండ అని, పార్ట్ 3 లో ఆయన కూడా అల్లు అర్జున్ తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంటాడని అంటున్నారు. అసలు పార్ట్ 3 నిజంగా ఉంటుందా అనే అనుమానం అభిమానుల్లో ఉంది. నిర్మాతలు అయితే కచ్చితంగా ఉంటుందని సక్సెస్ మీట్ లో తెలిపారు. కానీ ఇప్పుడే ఉండకపోవచ్చు అని, 2026 వ సంవత్సరం లో మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా పై ఫోకస్ పెట్టాడు. జనవరి నుండి ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఆయన అట్లీ తో ఒక సినిమా, సందీప్ వంగ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
ఈ రెండిట్లో సందీప్ వంగతో చేయబోయే సినిమాని ముందుగా ఆయన ప్రారంభించాలి అనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే ముందుగా వచ్చే ఏడాది చివర్లో ఒక నెల రోజుల షెడ్యూల్ ని ప్లాన్ చేసి విజయ్ దేవరకొండ మీద తియ్యాల్సిన సన్నివేశాలను మొత్తం చిత్రీకరిస్తారని, ఆ తర్వాత తీరిగ్గా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలను తీస్తారని ఒక టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, ఒకవేళ ఈ కాంబినేషన్ లో ‘పుష్ప 3’ తీస్తే మాత్రం ‘పుష్ప 2’ వసూళ్లను కేవలం మొదటి వారంలోనే అధిగమించే అవకాశాలు ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా పుష్ప 2 చిత్రం నిన్నటితో 1400 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంది . త్వరలోనే ఈ చిత్రం 2000 కోట్ల రూపాయిల మార్కుని కూడా అందుకోబోతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.