Pushpa 3 heroine: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కెరీర్ ని ‘పుష్ప ‘ సిరీస్ కి ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. అంతకు ముందు అల్లు అర్జున్ కేవలం టాలీవుడ్ హీరోలలో ఒకరు మాత్రమే, కానీ ఈ సిరీస్ తర్వాత ఆయన పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు ఆయన రేంజ్ ఖాన్స్ కి కూడా అందుకోవడం కష్టమే. నార్త్ ఇండియా లో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అయితే ‘పుష్ప’ లాంటి క్రేజీ బ్రాండ్ ఉన్న సినిమాని కేవలం రెండు భాగాలతో ముగించడం కరెక్ట్ కాదు, కచ్చితంగా ఆ ఫ్రాంచైజ్ ని కొనసాగించాలి. అందుకే ‘పుష్ప 3 ‘ కూడా ఉంటుందని , ‘పుష్ప 2’ క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్ ని చూపిస్తూ రివీల్ చేస్తాడు డైరెక్టర్ సుకుమార్.
ఎదో క్యాజువల్ గా ‘పుష్ప 3’ అని వేశారు కానీ, ఇది సాధ్యం అవ్వదు అని అంతా అనుకున్నారు. కానీ నిజంగానే ‘పుష్ప 3’ ఉంటుందట. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్న సుకుమార్ , ఈ సినిమా పూర్తి అవ్వగానే అల్లు అర్జున్ తో ‘పుష్ప 3’ మొదలు పెట్టబోతున్నాడట. ఈ మూవీ స్టోరీ రైటింగ్ కోసం ఒక టీం కూడా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు , నటీనటులను కూడా ఫైనల్ చేసే పనిలో పడ్డారట మేకర్స్. ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma) ని సంప్రదించబోతున్నట్టు తెలుస్తోంది. అదేంటి ?, పుష్ప ఫ్రాంచైజ్ లో రష్మిక నే కదా హీరోయిన్, ఇప్పుడు అనుష్క శర్మ కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు? అనే అనుమానం మీకు రావొచ్చు.
Also Read: కల్కి 2 స్టోరీ మార్చాలని చూస్తున్న డైరెక్టర్…
‘పుష్ప 2’ క్లైమాక్స్ లో విలన్ పుష్ప ఫ్యామిలీ మొత్తాన్ని పెళ్ళిలో ఉన్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ ద్వారా లేపేసినట్టు చూపించిన విజువల్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ బ్లాస్ట్ లో హీరోయిన్ పాత్ర శ్రీవల్లి చనిపోతుంది. కేవలం ‘పుష్ప’ మాత్రమే బ్రతుకుతాడు. ఇక ఆ తర్వాత స్టోరీ ఎలా నడుస్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ కథలోకి అనుష్క శర్మ ఎలాంటి పాత్ర ద్వారా రాబోతుంది ?, పోలీస్ ఆఫీసర్ పాత్రలోనా ?, లేదా వేరే ఏదైనా పాత్రలో రాబోతోందా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్. ఈమధ్య కాలం లో అనుష్క శర్మ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. మంచి కథ దొరికితే రీ ఎంట్రీ ఇస్తానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన అనుష్క, ఇప్పుడు ఈ రేంజ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే మాత్రం కెవ్వు కేక అనే చెప్పాలి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ వార్త ఎంత వరకు నిజం అవ్వబోతుంది అనేది.