https://oktelugu.com/

Pushpa 2 Update : పుష్ప 2 అప్డేట్… బన్నీ ఇటలీ నుండి రాగానే యాక్షన్ జాతరతో షురూ!

పుష్ప నుండి దేవిశ్రీ సైతం నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. దీంతో చిత్ర ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2023 / 07:45 PM IST
    Follow us on

    Pushpa 2 Update : ఇటలీ వెళ్లిన అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కి షార్ట్ బ్రేక్ ఇచ్చాడు. నవంబర్ 1న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం జరగనుంది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన క్రమంలో మెగా హీరోలందరూ సతీసమేతంగా అక్కడకు వెళ్లారు. పెళ్లి ముగియగానే అల్లు అర్జున్ హైదరాబాద్ రానున్నారు. వస్తూనే అల్లు అర్జున్ షూటింగ్ లో మరలా బిజీ కానున్నారని సమాచారం. కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది.

    జాతరలో అల్లు అర్జున్ మీద యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తారట. ఈ ఫైట్ సినిమాకు హైలెట్ కానుందట. హైదరాబాద్ లో జాతరను పోలిన సెట్ సిద్ధం చేశారట. ఫైట్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. పుష్ప పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో పార్ట్ 2 భారీగా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ రూ. 300 నుండి 350 కోట్ల వరకు ఉంటుందట. అల్లు అర్జున్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో పుష్ప 2 నిర్మిస్తున్నారు.

    ఇటీవల విడుదల తేదీ కూడా ప్రకటించారు. 2024 ఆగస్టు 15న పుష్ప 2 విడుదల తేదీగా ప్రకటించారు. కాగా పుష్ప అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. పుష్ప చిత్రంలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఈ గౌరవం దక్కిన మొదటి తెలుగు నటుడు అల్లు అర్జున్ కావడం కొసమెరుపు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు.

    పుష్ప నుండి దేవిశ్రీ సైతం నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. దీంతో చిత్ర ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. నేషనల్ అవార్డుల విజయాలను సెలబ్రేట్ చేసుకున్నారు. పుష్ప 2 అనంతరం అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ ప్రకటించారు. ఆయనతో బన్నీకి ఇది నాలుగవ చిత్రం అవుతుంది. గతంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వీరి కాంబోలో తెరకెక్కాయి. అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.